ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారు.మరి ఇలాంటి సందర్భంలోనే తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళుతున్న స్టార్ హీరోలు అందరూ వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తున్నారు.
మరి వాళ్ళు అనుకుంటున్నట్టుగానే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని క్రియేట్ చేసుకుంటారా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఇక పూరి జగన్నాధ్(Puri Jagannadh) లాంటి స్టార్ డైరెక్టర్ సైతం ప్రస్తుతం మంచి సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు.
ఇక ఇప్పటికే ఆయన విజయ్ సేతుపతితో(Vijay Sethupathi) ఒక సినిమా చేస్తున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.మరి ఈ సినిమాలో కూడా మాఫీయా బ్యాక్ డ్రాప్ ను ఎంచుకుంటున్నాడా? లేదంటే డిఫరెంట్ తరహా కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడా అనేది తెలియాల్సి ఉంది.ఇక మొత్తానికైతే ఈ సినిమాను భారీ విజయంగా మలిచే ప్రయత్నం లో పూరి తీవ్రమైన కసరత్తులు చేస్తున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోయే సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి.

వరుసగా ఆయనకు రెండు డిజాస్టర్లు రావడంతో ఆయనతో సినిమాలు చేయడానికి ఏ హీరో కూడా ఆసక్తి చూపించడం లేదు.మరి ఇలాంటి సందర్భంలో విజయ్ సేతుపతి అతనికి డేట్స్ ఇచ్చి తప్పు పని చేస్తున్నాడా అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.మరి ఏది ఏమైనా కూడా విజయ్ సేతుపతి లాంటి స్టార్ హీరో దొరికినప్పుడు పూరి జగన్నాధ్ తీవ్రమైన కసరత్తులు చేసైనా సరే మంచి విజయాన్ని సాధించాల్సిన అవసరమైతే ఉంది…చూడాలి మరి పూరి ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతాడా లేదా అనేది…
.