మనం ఏదైనా ఫంక్షన్ కి వెళ్లే ముందు అందంగా కనపడటానికి పేస్ ప్యాక్ వేసుకోవటమో లేదా మేకప్ వేసుకోవటం వంటివి చేస్తూ ఉంటాం.అయితే మీ ముఖం అందంగా బంగారు వర్ణంలో మెరిసిపోవాలంటే మాత్రం ఇప్పుడు చెప్పబోయే చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది.
ఈ చిట్కాలను ఫాలో అయితే మీ ముఖం అందంగా కాంతివంతంగా మెరిసిపోతుంది.
ఈ విధంగా మనం చేసుకుంటే గోల్డెన్ ఫేషియల్ చేయించుకున్న ఎఫెక్ట్ వస్తుంది.
అలాగే ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది.దీని కోసం రెండు స్టెప్స్ పాటించాల్సి ఉంటుంది.
మొదటి స్టెప్ స్క్రబ్బింగ్.రెండో స్టెప్ పేస్ ప్యాక్ వేసుకోవటం…
మొదట స్క్రబ్బింగ్ కి కావాల్సిన పదార్ధాల గురించి తెలుసుకుందాం.
మొదటి ఇంగ్రిడియన్ బొంబాయి రవ్వ
బొంబాయి రవ్వ పేస్ స్క్రబ్బింగ్ కి చాలా సహాయపడుతుంది.చర్మంలో మృతకణాలను చాలా సమర్ధవంతంగా తొలగిస్తుంది.
స్క్రబ్బింగ్ కి బొంబాయి రవ్వను ఉపయోగించటం వలన చర్మం మృదువుగా, ఫెయిర్ గా కన్పిస్తుంది
రెండో ఇంగ్రిడియన్ పాలు
పచ్చిపాలను ఉపయోగించాలి.

మూడో ఇంగ్రిడియన్ నిమ్మరసం.
నిమ్మరసంలో బ్లీచింగ్ గుణాలు ఉండటం వలన చర్మంపై నలుపును తొలగిస్తుంది.
ఒక బౌల్ లో బొంబాయి రవ్వ, పచ్చి పాలు, నిమ్మరసం వేసి బాగా కలపాలి.
ఈ పేస్ట్ ని ముఖానికి రాసి 5 నిమిషాల పాటు స్క్రబ్ చేసి పది నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.ఇప్పుడు స్క్రబ్బింగ్ అయ్యిపోయింది.
ఇక రెండో స్టెప్ ప్యాక్ వేసుకోవాలి.
ప్యాక్ ని ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.
ఒక బౌల్ లో ఒక స్పూన్ శనగపిండి ,ఒక స్పూన్ ముల్తానీమట్టి , రేడు స్పూన్ల పాలు, ఒక స్పూన్ నిమ్మరసం ,అరస్పూన్ తేనే, చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి.ఈ పేస్ట్ ని ముఖానికి రాసి పావుగంట అయ్యాక చల్లని నీళ్లు ముఖం మీద జల్లుకుంటూ శుభ్రం చేసుకోవాలి.
ఈ ప్యాక్ ముఖం మీద ఉన్న నలుపు, డల్ నెస్ , మృతకణాలను తొలగించి ముఖం కాంతివంతంగా ఉండేలా చేస్తుంది.