సాధారణంగా ఒక్కోసారి చేతులు నల్లగా( Black hands ) నిర్జీవంగా మారుతుంటాయి.ముఖ్యంగా ఎండల్లో తిరిగినప్పుడు ఈ సమస్యను ప్రధానంగా ఫేస్ చేస్తూ ఉంటాము.
అలాంటి సమయంలో ఏం చేయాలో తెలియక తెగ సతమతం అయిపోతుంటారు.చేతులను రిపేర్ చేసుకునేందుకు బ్యూటీ పార్లర్ కు పరుగులు పెడతారు.
వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.కానీ నల్లగా నిర్జీవంగా మారిన చేతులను ఇంట్లోనే పైసా ఖర్చు లేకుండా రిపేర్ చేసుకోవచ్చు.
అందుకు ఇప్పుడు చెప్పబోయే రెమెడీ సూపర్ ఎఫెక్టివ్ గా తోడ్పడుతుంది.

ముందుగా ఒక టమాటోను( Tomato ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇలా కట్ చేసుకున్న ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి( rice flour ), రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్ ( Coffee powder )వేసుకోవాలి.
అలాగే వన్ టీ స్పూన్ పెరుగు మరియు సరిపడా టమాటో ప్యూరీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని రెండు చేతులకు అప్లై చేసి 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై తడి వేళ్ళతో చేతులను సున్నితంగా స్క్రబ్బింగ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఫైనల్ గా తడి లేకుండా క్లాత్ తో తుడుచుకుని మాయిశ్చరైజర్ లేదా అలోవెరా జెల్ ను రెండు చేతులకు అప్లై చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఈ సూపర్ రెమెడీని కనుక పాటిస్తే చేతులపై పేరుకుపోయిన మురికి, మృత కణాలు తొలగిపోతాయి.నల్లగా, నిర్జీవంగా మారిన చేతులు తెల్లగా మృదువుగా మారతాయి.
కాంతివంతంగా మెరుస్తాయి.అలాగే అండర్ ఆర్మ్స్ డార్క్ గా ఉన్నాయని బాధపడుతున్న వారు, నెక్ పార్ట్ డార్క్ గా ఉందని వర్రీ అవుతున్న వారికి కూడా ఈ రెమెడీని ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.