ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాను ఫాలో కావడంలేదు అనేవారు ఉన్నారంటే నమ్మే పరిస్థితి లేదు.సందర్భం ఏదైనా సరే.
దానిని వీడియో రూపంలో చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం చాలా మందికి పరిపాటిగా మారింది.పుట్టుక, పెళ్లి, చావు ఇలా సందర్భం ఏదైనా సరే ప్రతి దానిని వీడియో రూపంలో చిత్రీకరించి దానిని సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి చూపెడుతున్నారు.
మరోవైపు ఈ మధ్యకాలంలో కొందరు కొత్తగా పెళ్లయిన జంట వారి శోభనం సంబంధించిన వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం ట్రెండ్గా మారింది.అలాంటి మరో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇటీవల జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ (Jr.NTR, Janhvi Kapoor)జంటగా నటించిన “దేవర” (Devara)చిత్రంలోని “చుట్టమల్లె చుట్టేస్తానే” (Cuttamalle cuttastane)పాట హిట్ అయ్యిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ పాట ప్రతి చోటా వినిపిస్తూనే ఉంది.ఇప్పుడు మరింత ట్రెండింగ్ అవుతూ, వేరే లెవెల్‌లో పాటను వాడేసుకుంటున్నారు.తాజాగా, ఈ పాట కేరళలో కొత్తగా పెళ్లైన ఓ జంట శోభనం గదిలోకి వెళ్లే సందర్భంలో వినిపించింది.వరుడిని గది లోపలికి పంపే సమయంలో ఈ పాట బ్యాగ్రౌండ్‌లో ప్లే చేయగా.
నవ వధువు పాల గ్లాసుతో ముసిముసి నవ్వులు నవ్వుతూ లోపల అడుగుపెట్టింది.ఇక వరుడు గుబురు గడ్డంతో, స్టైలిష్ కళ్లద్దాలు వేసుకుని గ్లాసును అందుకున్నాడు.
దీంతో, అక్కడున్న బంధువులందరూ నవ దంపతులకు శుభాకాంక్షలు చెప్పి హాల్లోంచి నిశ్శబ్దంగా తప్పుకున్నారు.