సినీ నటుడు ఏపీ డిప్యూటీ సీఎం ( AP Deputy CM )పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం మనకు తెలిసిందే.ఇలా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ ఈయన మాత్రం తన కార్యకలాపాలను కొనసాగిస్తూ ఉన్నారు.
ఇటీవల సనాతన ధర్మ యాత్రకు కూడా వెళ్లిన విషయం మనకు తెలిసిందే .అదే విధంగా మహా కుంభమేళాలో కూడా కనిపించారు.ఇక ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖ గుప్త ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో కూడా పవన్ కళ్యాణ్ ఈ వేడుకలో పాల్గొన్నారు.

ఇలా అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఈయన తన కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని చెప్పాలి. అయితే ఈయన అనారోగ్య సమస్యలు ( Health Issues ) కాస్త అధికమైన నేపథ్యంలో హైదరాబాద్ అపోలో హాస్పిటల్ కి వెళ్లి అక్కడ పరీక్షలు చేయించుకున్నట్టు తెలుస్తుంది.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గత కొద్దిరోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు.దానితోపాటు స్పాండిలైటిస్ సమస్య కూడా ఆయనను ఇబ్బంది పెడుతోంది.
ఈ క్రమంలోనే హైదరాబాద్ అపోలో హాస్పిటల్ ( Apollo hospital )కి వెళ్లి ఈయన పలు పరీక్షలను చేయించుకున్నట్లు సమాచారం.

నిన్న సాయంత్రం కొన్ని పరీక్షలను నిర్వహించగా వైద్యులు ఈనెలఖరిలోగా మరికొన్ని పరీక్షలను నిర్వహించబోతున్నారని తెలుస్తోంది.అయితే రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఈయన తిరిగి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు.అయితే గత కొంతకాలంగా తరచు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పవన్ ఆరోగ్య పరిస్థితి తెలిసిన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈయన త్వరగా కోలుకోవాలి అంటూ ఆకాంక్షిస్తున్నారు.







