డార్లింగ్ ప్రభాస్ ( Darling Prabhas )ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా మూవీ లతో బిజీ బిజీగా ఉన్నారు.
ప్రభాస్ చేతిలో ప్రస్తుతం నాలుగైదు సినిమాలు ఉన్నాయి.ఇవన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం.
ఆ సంగతి పక్కన పెడితే ప్రభాస్ ప్రస్తుతం రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు.అంటే ఒకేసారి రాజాసాబ్, ఫౌజి ( Rajasab, Fauji )సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.
అలాగే కల్కి 2 సినిమా ఎప్పుడైనా మొదలు కావచ్చు.మరోవైపు స్పిరిట్ సినిమా కూడా లైన్ లో ఉంది.
ఇలా చేతిలో బోలెడు ప్రాజెక్టులతో అన్ని సినిమాలకు డేట్లు కేటాయిస్తున్నారు ప్రభాస్.

అయితే ఇలా అన్ని సినిమాలకు డేట్లు ఇస్తున్న ప్రభాస్ కు స్పిరిట్ విషయంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ( Sandeep Reddy Vanga )మాత్రం స్ట్రాంగ్ కండీషన్ పెట్టాడని తెలుస్తోంది.స్పిరిట్ చేస్తున్నప్పుడు మరో సినిమా చేయకూడదని, ఫుల్ టైమ్ స్పిరిట్ కే కేటాయించాలని ప్రభాస్ కు చెప్పాడట.స్పిరిట్ లుక్ వేరేలా ఉంటుందని, ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడట.
అందుకోసం బాడీ కూడా బిల్డ్ చేయాలట.తన లుక్ బయటకు వెళ్లకూడదని ప్రభాస్ భావిస్తున్నాడని అందుకే ఈ నిర్ణయం తీసుకొన్నాడని తెలుస్తోంది.

ఒకసారి షూటింగ్ మొదలెడితే, ఏక ధాటిగా పని చేసి ప్రాజెక్ట్ పూర్తి చేస్తానని, అప్పటి వరకూ స్పిరిట్ మూడ్ లోనే ఉండాలని ప్రభాస్ కు చెప్పాడట దర్శకుడు.ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సినిమా స్క్రిప్ట్ పనుల్లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.ఈలోగా ప్రభాస్ ని కూడా తన ప్రాజెక్టులు పూర్తి చేసుకోమని చెప్పాడట.సందీప్ స్టైల్ వేరు.తను పూర్తి డెడికేషన్ తో పని చేస్తాడు.తన టీమ్ లోనూ అలాంటి వాళ్లే ఉండాలని అనుకుంటాడు.
ప్రభాస్ పెద్ద స్టారే కావచ్చు.కానీ సందీప్ కంటూ ఒక ప్రత్యేకమైన విజన్ ఉంది.
ఆ విజన్ ప్రకారం పని చేయాలంటే దర్శకుడు చెప్పినట్టు నడుచుకోవాల్సిందే.ప్రభాస్ కూడా సందీప్ రెడ్డి వంగా పెట్టిన కండిషన్స్ కు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.