ప్రభాస్ ,మారుతి( Prabhas, Maruti ) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ది రాజాసాబ్( The Rajasab ) సినిమాపై అంచనాలు మామూలుగా లేవు.ప్రభాస్ పై ఉన్న కాన్ఫిడెన్స్ వల్ల ప్రభాస్ వరుస విజయాలు సాధించడం వల్ల ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.
ది రాజాసాబ్ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తుండటం, హర్రర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.
వాస్తవానికి ఏప్రిల్ నెల 10వ తేదీన ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉన్నా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఈ ఏడాది దసరా పండుగ కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.
ది రాజాసాబ్ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉండగా ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలలో మాత్రం తక్కువ అంచనాలు నెలకొన్న సినిమా ఇదేనని చెప్పడంలో మాత్రం ఎలాంటి సందేహం అవసరం లేదని చెప్పవచ్చు.

ది రాజాసాబ్ సినిమా పాన్ ఇండియా మూవీగా( pan India movie ) విడుదల కానుండగా ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని సోషల్ మీడియా వేదికగా వినిపిస్తోంది.ది రాజాసాబ్ సినిమా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్( People’s Media Factory banner ) లో హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా కాగా ఆ బ్యానర్ కు కూడా ఈ సినిమా సక్సెస్ సాధించడం ఎంతో కీలకమని చెప్పవచ్చు.ది రాజాసాబ్ సినిమా ఇతర భాషల్లో ఏ రేంజ్ లో హిట్టవుతుందో చూడాల్సి ఉంది.

అయితే ది రాజాసాబ్ మూవీ హిట్టైన తర్వాతే ఈ సినిమాకు సీక్వెల్ ప్రకటిస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ది రాజాసాబ్ సినిమా తాతా మనవళ్ల కథాంశంతో తెరకెక్కుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.సలార్, కల్కి సినిమాలను మించి ది రాజాసాబ్ తో మెప్పించడం ప్రభాస్ కు సాధ్యమవుతుందో లేదో చూడాల్సి ఉంది.