ఈ ఏడాది సంక్రాంతి పండుగ( Sankranti festival ) కానుకగా విడుదలైన సినిమాలలొ గేమ్ ఛేంజర్ సినిమాకు( Game changer ) ఫ్లాప్ టాక్ రాగా డాకు మహారాజ్ సినిమాకు అబవ్ యావరేజ్ టాక్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు బ్లాక్ బస్టర్ హిట్ వచ్చాయి.గేమ్ ఛేంజర్ మూవీ జనవరి 10వ తేదీన థియేటర్లలో విడుదల కాగా డాకు మహారాజ్ మూవీ( Daku Maharaj Movie ) జనవరి 12వ తేదీన సంక్రాంతికి వస్తున్నాం మూవీ జనవరి 14వ తేదీన థియేటర్లలో విడుదల కావడం జరిగింది.
సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించిన నేపథ్యంలో డాకు మహారాజ్ సినిమా అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ అయినా 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించే విషయంలో మాత్రం ఫెయిల్ అయిందని చెప్పవచ్చు.అయితే ఈ సినిమాను ఫ్యామిలీ మూవీగా ప్రచారం చేసి ఉంటే బాగుండేదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

డాకు మహారాజ్ సినిమాను ఫ్యామిలీ మూవీగా పబ్లిసిటీ చేయకుండా యాక్షన్ మూవీగా పబ్లిసిటీ చేయడం వల్ల ఎక్కువమంది ఈ సినిమాను యాక్షన్ సినిమాగానే భావించారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.డాకు మహారాజ్ మూవీ ఓటీటీ ప్రేక్షకులను మాత్రం ఎంతగానో మెప్పిస్తోంది.బాలయ్య తన తర్వాత సినిమాలకు సంబంధించి ప్రమోషన్స్ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు.

బాలయ్య బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా బిజీ అవుతుండగా అఖండ2 సినిమా ( Akhanda 2 movie )బడ్జెట్ ఏకంగా 200 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది.అఖండ సీక్వెల్ సినిమాకు బిజినెస్ కూడా ఒకింత భారీ జరుగుతోంది.బాలయ్య బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో భారీ విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
డాకు మహారాజ్ మూవీ ఇతర భాషల్లో సైతం విడుదలైనా ఇతర భాషల ప్రేక్షకులను మెప్పించే విషయంలో మాత్రం ఈ సినిమా ఫెయిల్ అయిందనే సంగతి తెలిసిందే.







