షాకింగ్ వీడియో: బ్రాహ్మణ అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు ముస్లిం వ్యక్తిని చితక్కొట్టిన లాయర్లు..

మధ్యప్రదేశ్‌లో( Madhya Pradesh ) దారుణం జరిగింది.ఒక బ్రాహ్మణ యువతిని( Brahmin girl ) పెళ్లి చేసుకోవడానికి లాయర్ల ఆఫీస్‌కు వెళ్లిన ముస్లిం యువకుడిపై లాయర్లు మూకుమ్మడి దాడి చేశారు.

 Shocking Video Lawyers Beat Up Muslim Man For Marrying Brahmin Girl, Interfaith-TeluguStop.com

వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటామంటే వీళ్లకేం నొప్పి అని కొందరు వీడియో చూసినోళ్లు ఫైర్ అవుతున్నారు.ఇద్దరూ లీగల్‌గా పెళ్లి చేసుకుందామని ఆఫీస్‌కు వెళ్లారు పాపం.

కానీ అక్కడ లాయర్లు వాళ్ల ఆధార్ కార్డులు చూడగానే అనుమానం పెంచుకున్నారు.ఇది ‘లవ్ జిహాద్’ కేసు అని ముద్ర వేసేశారు.

మతం మార్చేందుకే పెళ్లి చేసుకుంటున్నారని ఆరోపించారు.దాంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది.

లాయర్లు( Lawyers ) ఆ ముస్లిం యువకుడిపై పిడిగుద్దులు కురిపించారు.చుట్టుముట్టి కొట్టారు.

అంతటితో ఆగకుండా అతన్ని క్షమాపణ చెప్పమని, సీటప్‌లు తీయమని హుకుం జారీ చేశారు.ఆ అమ్మాయి కళ్ల ముందే అతన్ని దారుణంగా అవమానించారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఆ జంటను కాపాడారు.ఈ గూండాగిరికి పాల్పడిన లాయర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఘటనతో మతపరమైన అసహనం, మానవ హక్కుల ఉల్లంఘనలపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.నిన్ననే రేవాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది.అక్కడ కూడా ఒక ముస్లిం యువకుడు, హిందూ యువతి ఇంటర్ ఫెయిత్ మ్యారేజ్ రిజిస్టర్ చేసుకోవడానికి కోర్టుకు వెళ్తే లాయర్లు అడ్డుకున్నారు.

రేవా కేసులో అయితే ఆ అమ్మాయి బుర్ఖా వేసుకుని వచ్చింది.పేరు చెప్పగానే లాయర్లకు అనుమానం వచ్చింది.వెంటనే ఆ అబ్బాయి ఆధార్ కార్డు చూపించమని గొడవ చేశారు.

అతను ముస్లిం అని తెలియగానే చుట్టుముట్టి దాడి చేశారు.ఒక్కొక్కరుగా మరికొంతమంది లాయర్లు వచ్చి కొట్టడంతో మరింత హింస చెలరేగింది.

ఈ రెండు ఘటనలు చూస్తుంటే ఇంటర్ ఫెయిత్ మ్యారేజ్‌ల విషయంలో టెన్షన్లు పెరుగుతున్నాయని అర్థమవుతోంది.భద్రత, మత స్వేచ్ఛ, చట్టపరమైన హక్కులపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

గర్ల్‌ఫ్రెండ్, అతన్ని పోలీసులు కాపాడిన వీడియో చూడటానికి ఈ లింక్ https://x.com/HateDetectors/status/1893182288495788527?t=IQEOSi7_Kis3GsuNJ7Irmg&s=19 మీద నొక్కండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube