నేటి ఆధునిక కాలంలో దాదాపు ప్రతి మనిషి ఉరుకుల పరుగుల జీవితాన్ని గడుపుతున్నాడు.ఈ క్రమంలో శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా అలసిపోతున్నాడు.
కాబట్టి ఫిసికల్ హెల్త్ తో పాటు మెంటల్ హెల్త్ పై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా అవసరం.ముఖ్యంగా మెదడుకు ఎప్పటికప్పుడు పదును పెడుతూ ఉండాలి.
లేదంటే 30 ఏళ్లకే మతిమరుపు, ఆలోచన శక్తి తగ్గిపోవడం తదితర సమస్యలు తలెత్తుతాయి.అయితే బ్రెయిన్ ను సూపర్ షార్ప్ గా మార్చడానికి కొన్ని కొన్ని ఫుడ్స్ చాలా బాగా సహాయపడతాయి.
ఈ జాబితాలో బ్లూబెర్రీస్ ఒకటి.
ఈ మ్యాజికల్ ఫ్రూట్ మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
బ్లూ బెర్రీస్( Blue berries ) నీలం లేదా ఊదా రంగులో ఉంటాయి.చక్కని రుచి మరియు అనేక ఆరోగ్య ప్రయోజనాలకు ఇవి ప్రసిద్ధి చెందాయి.
బ్లూబెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ( Antioxidants , vitamins )మరియు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.ప్రధానంగా మెదడుకు బ్లూబెర్రీస్ ఒక సూపర్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు.
రెగ్యులర్ డైట్ లో బ్లూబెర్రీస్ చేర్చుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది.ఆలోచన సామర్థ్యం రెట్టింపు అవుతుంది.
వయసు పైబడినా జ్ఞాపకశక్తి తగ్గకుండా ఉంటుంది.అల్జీమర్స్ వంటి ప్రమాదకరమైన మెదడు సంబంధిత జబ్బులు వచ్చే ప్రమాదాన్ని బ్లూ బెర్రీస్ తగ్గిస్తాయి.
అలాగే బ్లూబెర్రీస్ వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.బ్లూబెర్రీస్ తక్కువ కేలరీలను మరియు ఎక్కువ ఫైబర్‌ను కలిగి ఉంటాయి.అందువల్ల బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారికి ఇవి గొప్ప చిరుతిండి.మలబద్ధకంతో( constipation ) బాధపడుతున్న వారు నిత్యం గుప్పెడు బ్లూబెర్రీస్‌ను తీసుకుంటే ఆ సమస్య నుంచి సులభంగా బయటపడారు.
బ్లూబెర్రీస్ జీర్ణ సమస్యలను సమర్థవంతంగా నివారిస్తాయి.
బ్లూబెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.ఇవి గుండె జబ్బులు మరియు క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.మరియు బ్లూబెర్రీస్ లో ఉండే విటమిన్లు సి, విటమిన్ కె వంటి పోషకాలు రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.
బ్యాక్టీరియా మరియు ఇన్ఫెక్షన్స్ తో పోరాడే సామర్థాన్ని చేకూరుస్తాయి.