మీకున్న ఈ అల‌వాట్లే ఎముక‌ల బ‌ల‌హీన‌త‌కు కార‌ణాలు..జాగ్ర‌త్త‌!

ఇటీవ‌ల కాలంలో ఎముక‌ల బ‌ల‌హీన‌త అనేది చాలా మందిలో చాలా కామ‌న్‌గా క‌నిపిస్తోంది.ఎముక‌లు బ‌ల‌హీనంగా మారడం వ‌ల్ల తీవ్ర‌మైన కీళ్ల నొప్పులు, చిన్న దెబ్బ‌ల‌కే ఎముక‌లు విర‌గ‌డం, ఎక్కువ సేపు ఏ ప‌నీ చేయ‌లేక‌పోవ‌డం ఇలా ఎన్నో స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

 These Habits You Have Are The Causes Of Bone Weakness! Habits, Causes Of Bone We-TeluguStop.com

అయితే ఎముక‌లు బ‌ల‌హీనంగా మార‌డానికి కార‌ణాలు ఏంటో తెలుసా.? మీకున్న అల‌వాట్లే.అవును, మీకు ఉండే కొన్ని అల‌వాట్ల వ‌ల్లే పుష్టిగా ఉండే మీ ఎముక‌లు పెలుసుగా మారిపోతాయి.మ‌రి ఆ అల‌వాట్లు ఏంటో ఆల‌స్యం చేయ‌కుండా చూసేయండి.

సాధార‌ణంగా కొంద‌రు కావాల్సిన దాని కంటే ఎక్కువ‌గా ఉప్పును తీసుకుంటుంటారు.కానీ, ఎముక‌ల‌కు ఉప్పు ఏ మాత్రం మంచిది కాదు.

అతిగా ఉప్పు తీసుకోవ‌డం వ‌ల్ల ఎముక‌లు క్ర‌మంగా బ‌ల‌హీన ప‌డిపోతాయి.సో.ఉప్పును ఎంత లిమిట్‌గా తీసుకుంటే అంత మంచిది.

కొంద‌రు ఉద్యోగ‌స్తులు రెస్ట్ లేకుండా ఒకే చోట‌ కూర్చుని గంట‌లు త‌ర‌ప‌డి ప‌ని చేస్తుంటారు.

ఈ కార‌ణంగా కూడా ఎముక‌లు బ‌ల‌హీన ప‌డిపోతాయి.కాబ‌ట్టి, ఒకే చోట కూర్చుని వ‌ర్క్ చేసే వారు ఖ‌చ్చితంగా మ‌ధ్య మ‌ధ్య‌లో గ్యాప్‌ తీసుకోవాలి.

మ‌రియు రెగ్యుల‌ర్‌గా వ్యాయామాలు చేయాలి.

ఎముక‌లు బ‌లంగా ఉండాలంటే కాల్షియం, విట‌మిన్ డి ఎంతో అవ‌స‌రం.

కానీ, చాలా మంది ఈ పోష‌కాలు ఉండే ఫుడ్స్‌ను తీసుకునే విష‌యంలో నిర్ల‌క్ష్యం వహిస్తారు.ఫ‌లితంగా ఎముక‌ల బ‌ల‌హీన‌త‌కు గుర‌వుతారు.

అందుకే ఈ అల‌వాటును ఇక‌పై మార్చుకోండి.

మ‌ద్యం సేవించ‌డం.నేటి ఆధునిక కాలంలో పురుషుల‌కే కాదు స్త్రీల‌కు కూడా ఉన్న అల‌వాటు ఇది.అయితే, అతిగా మ‌ద్యం తీసుకోవ‌డం వ‌ల్ల ఎముక‌ల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బ తింటుంది.

ఇక మ‌ద్య‌పాన‌మే కాదు ధూమ‌పాన‌మూ ఎముక‌ల‌కు హానిక‌ర‌మే.అవును, ధూమ‌పానం చేసే వారిలో ఎముకల సాంద్రత త‌గ్గిపోతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.అందుకే మ‌ద్య‌పానానికి , ధూమ‌పానానికి దూరంగా ఉండాల‌ని సూచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube