K.K. Senthil Kumar : ఇండియాలోనే బెస్ట్ సినిమాటోగ్రాఫర్.. అతడు షాట్ తీస్తే వెండితెరకు అతుక్కుపోవాల్సిందే..

భారతదేశంలో బెస్ట్ సినిమాటోగ్రాఫర్ ఎవరైనా ఉన్నారా అంటే ముందుగా టాలీవుడ్ ప్రేక్షకులందరికీ కె.కె.సెంథిల్ కుమార్( K.K.Senthil Kumar ) గుర్తుకొస్తాడు.ఈ దిగ్గజ టెక్నీషియన్ హైదరాబాద్‌లో తమిళ్ మాట్లాడే కుటుంబంలో జన్మించాడు.

 Top 10 Senthil Kumar Works-TeluguStop.com

ఇతనికి పెరిగి పెద్దయ్యాక సినిమాలపై బాగా ఆసక్తి పెరిగింది.ఆ ఆసక్తితోనే పుణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో చేరి సినిమాటోగ్రఫీలో డిగ్రీ పూర్తి చేశాడు.

తర్వాత సినిమాటోగ్రాఫర్ శరత్ వద్ద అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్‌గా చేరి ప్రేమకు వేళయరా (1999) నుంచి జాబిలి (2001) వరకు అతని వద్దే పనిచేశాడు.ప్రముఖ కామెడీ సీరియల్ అమృతంలో కూడా 13 ఎపిసోడ్లకు పనిచేశాడు.

Telugu Cinematographer, Chhatrapati, Ithe, Magadheera, Senthil Kumar, Senthilkum

2003లో సెంథిల్ కుమార్ ‘ఐతే’( ithe ) సినిమాతో తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టాడు.ఈ సినిమాలో ఆయన చేసిన సినిమాటోగ్రఫీకి విమర్శకులు సైతం ఫిదా అయ్యారు.2004లో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘సై’ ( sy )సినిమా సెంథిల్ కుమార్ కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.ఈ సినిమాలో ఆయన చేసిన సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉండి అందరి నుంచి ప్రశంసలు పొందింది.అంతేకాదు బెస్ట్ సినిమాటోగ్రాఫర్‌ గా ఫిల్మ్‌ఫేర్ అవార్డును కూడా గెలుచుకున్నాడు.2005లో ప్రభాస్ టైటిల్ రోల్ లో నటించిన ‘ఛత్రపతి’ ( Chhatrapati )సినిమాలో సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉండి బ్రహ్మాండమైన విజువల్ ఎక్స్‌పీరియన్స్ ప్రేక్షకులకు అందించింది.2007లో ఎన్టీఆర్ టైటిల్ రోల్ లో నటించిన ‘యమదొంగ’ సినిమాలో సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ కూడా వేరే లెవెల్ లో ఉందని చెప్పవచ్చు.2009లో అనుష్క టైటిల్ రోల్ లో నటించిన ‘అరుంధతి’ సినిమాలో సెంథిల్ కుమార్ తనకు కెమెరా పనితీరు ఎంత గొప్పగా ఉంటుందో నిరూపించాడు.

Telugu Cinematographer, Chhatrapati, Ithe, Magadheera, Senthil Kumar, Senthilkum

2009లో రామ్ చరణ్ హీరోగా నటించిన ‘మగధీర’ ( Magadheera )సినిమాలో సెంథిల్ కుమార్ చూపించిన కెమెరా వర్క్ హాలీవుడ్ లెవెల్ లో ఉందని చెప్పవచ్చు.2012లో నాని, సమంత జంటగా నటించిన ‘ఈగ’ సినిమాలోనూ సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ ఆస్కార్ అవార్డు విన్నింగ్ రేంజ్ లో ఉండి ప్రేక్షకులను వెండితెరకు కట్టిపడేసింది.2015లో రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన ‘బాహుబలి: ది బిగినింగ్’, 2017లో వచ్చిన ‘బాహుబలి: ది కంక్లూజన్’ సినిమాలలో సెంథిల్ కుమార్ తీసిన షాట్లు భారత సినిమా చరిత్రలోనే గొప్పవిగా మిగిలిపోయాయి.2022లో రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా వచ్చిన ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో సెంథిల్ ఒక్కో షాట్ ను ఒక్కో మాస్టర్ పీస్‌గా తీసి భారత ప్రేక్షకులు మునుపెన్నడూ అనుభవించని విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ని కలిగించాడు.బాహుబలి ఆర్ఆర్ఆర్ సినిమాలతో ప్రపంచ స్థాయిలో ఈ టెక్నీషియన్ పేరు తెచ్చుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube