తెలుగు సినిమా పరిశ్రమ నుంచి వచ్చిన సినిమాల్లో పలు సీన్లు ఎక్కడెక్కడి నుంచో కొట్టేసిన సీన్లు చాలా కనిపిస్తాయి.రీమేక్ సినిమాల ముచ్చట అటుంచితే స్ట్రెయిట్ సినిమాల్లోనే ఎత్తుకొచ్చిన సీన్లు పదుల సంఖ్యల్లో కనిపిస్తాయి.
ఈ కాలంలో ఈ సంఖ్య మరింత పెరిగింది.ఇలా ఎక్కడెక్కి నుంచో ఎత్తుకొచ్చిన సీన్లతో సినిమాలు తీస్తే దాన్నే ముద్దుగా ప్రీమేక్ అంటారు.
అలాంటి ప్రీమేక్ సినిమాలోనే నటించింది అందాల ముద్దుగుమ్మ రోజా.ఈ సినిమాకు దర్శకత్వం వహించింది మరెవరో కాదు ఆమె భర్త సెల్వమణి ఇంతకీ ఆ సినిమా ముచ్చటేందో ఇప్పుడు తెలుసుకుందాం.
1995లో రోజా తెలుగు తెరను ఏలుతుంది.ఇదే సమయంలో అసురన్ అనే సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందింది.అప్పట్లో నిత్యం వార్తల్లో నిలిచే గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కథను, హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ప్రిడేటర్ ను కలిపి ఓ సినిమాను తెరకెక్కించాడు ఫిల్మ్ మేకర్ సెల్వమణి.ఈ సినిమాలో బాడీ బిల్డర్ అరుణ్ పాండ్యన్ హీరోగా కాగా, రోజా హీరోయిన్.
అప్పట్లో ఈ సినిమా సంచలన విజయం సాధించింది.తెలుగు, తమిళ భాషల్లోనూ రికార్డు స్థాయి వసూళ్లు సాధించింది.
ప్రిడేటర్ సినిమాలో కండల వీరుడు అర్నాల్డ్ హీరోగా చేశాడు.అలాంటి దేమ దారుఢ్యం కలిగిన అరుణ్ పాండ్యన్ ను ఈ సినిమాలో హీరోగా పెట్టాడు సెల్వమణి.అద్భుత సినిమా చేసి హిట్ కొట్టాడు.
అదే సమయంలో వీరప్పన్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు దాదాపు అన్నీ విజయం సాధించాయి.అలా వచ్చిందే కెప్టెన్ ప్రభాకర్ మూవీ.ఈ సినిమాలోని కొన్ని సీన్లను, అర్నాల్ ప్రిడేటర్ సినిమాలోని మరికొన్ని సీన్లను ఎత్తుకొచ్చి అసరున్ సినిమా తీశాడు సెల్వమణి.ఈ సినిమాకు నిర్మాత కూడా సెల్వమణి వ్యవహరించాడు.అప్పట్లో ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి.రోజా, అరుణ్ పాండ్యన్ నటించిన అసురన్ సినిమా తెలుగులోకి కమాండో పేరుతో విడుదల అయ్యింది.తెలుగు జనాలు సైతం ఈ సినిమాను బాగా ఆదరించారు.
ఈ సినిమా చేసే సమయానికి రోజా, సెల్వమణి ప్రేమలో ఉన్నారు.ఆ తర్వాత వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు
.