థాయ్‌లాండ్‌లోని( Thailand ) ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం పట్టాయా బీచ్‌లో శుక్రవారం రచ్చ జరిగింది.ఇద్దరు భారతీయ పర్యాటకులు ఇద్దరు థాయ్ మహిళలను వేధించడంతో బీచ్ ఒక్కసారిగా యుద్ధరంగంలా మారింది.
టూరిస్టుల ఆగడాలు శృతిమించడంతో అక్కడే ఉన్న టాక్సీ డ్రైవర్లు, స్థానికులు రంగంలోకి దిగారు.బాధితులకు మద్దతుగా నిలబడి, ఆకతాయి మూకకు దేహశుద్ధి చేశారు.
వెంటనే పోలీసులకు కూడా సమాచారం అందించారు.ఈ గొడవకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఒక వీడియోలో థాయ్ మహిళ చేతిలో కర్ర పట్టుకుని నల్ల చొక్కా వేసుకున్న భారతీయ వ్యక్తిని వెంటాడుతూ కొడుతూ ఉండటం స్పష్టంగా కనిపిస్తోంది.
లోకల్ మీడియా ప్రకారం, వేధింపులకు గురైన ఇద్దరు థాయ్ మహిళలు( women ) తమ పేర్లు చెప్పడానికి ఇష్టపడలేదు.
వారు బీచ్ దగ్గర ఉండగా ఇద్దరు భారతీయులు తమ వద్దకు వచ్చి అసభ్యంగా ప్రవర్తించారని వాపోయారు.వారిలో ఒకడు వీడియో తీయడం మొదలుపెట్టాడని, వీడియో డిలీట్ చేయమని అడిగితే వాగ్వాదం జరిగిందని, ఆ తర్వాత అది కొట్లాటకు దారితీసిందని వారు తెలిపారు.

పట్టాయా పోలీస్ స్టేషన్( Police station ) నుంచి పోలీస్ మేజర్ కల్నల్ నోంగ్‌సాక్ ఇన్‌ఫడుంగ్ ఈ ఘటనను ధృవీకరించారు.ఈ గొడవలో ఐదుగురికి గాయాలయ్యాయని ఆయన చెప్పారు.గాయపడిన వారిలో ఇద్దరు థాయ్ మహిళలు, ఇద్దరు భారతీయ పురుషులు, సహాయం చేయడానికి ప్రయత్నించిన ఒక మోటార్‌సైకిల్ టాక్సీ డ్రైవర్ ఉన్నారు. టాక్సీ డ్రైవర్‌కి ( taxi driver )కాలు బెనకడంతో పాటు కంటికి కూడా గాయమైంది.

ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు.నిజానిజాలు నిగ్గు తేల్చడానికి ఆధారాలు సేకరిస్తున్నారు.ఈ గొడవకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.భద్రత, పర్సనల్ ప్రైవసీకి సంబంధించిన అంశాలపై నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.ఈ హింసాత్మక సంఘటన స్థానికులు, పర్యాటకులలో ఆందోళనలను రేకెత్తించింది.ఇలాంటి వేధింపులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజల్లో అవగాహన పెంచాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.







