1.డాలాస్ కు రావాలంటూ ఉప రాష్ట్రపతి కి ఆహ్వానం
మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ అధ్యక్షుడు డాక్టర్ ప్రసాద్ తోటకూర తాజాగా భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిశారు.మహాత్మా గాంధీ మెమోరియల్ వద్ద అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వాటికి తప్పనిసరిగా హాజరు కావాలి అంటూ ఆయన కోరారు.
2.భారత్ కు కొత్త విమాన సర్వీసు
యూఏఈకి చెందిన బడ్జెట్ క్యారియర్ ఎయిర్ అరేబియా అబుదబి భారత్ లోని ముంబైకి కొత్త విమాన సర్వీసు ను ప్రకటించింది.2022 మే 12 నుంచి ఈ సర్వీసును నడపనున్నారు.
3.యూఏఈ లో వారం రోజుల సెలవులు
ఈద్ ఆల్ ఫితర్ కు ఏకంగా వారం రోజుల పాటు సెలవులు ప్రకటిస్తూ యూఏఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
4.నెదర్లాండ్ లో చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు
నెదర్లాండ్ లో టిడిపి ఎన్.ఆర్.ఐ విభాగం ఆధ్వర్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.
5.ఇద్దరు భారతీయులకు జాక్ పాట్
మహారాజ్ రాఫెల్ లో ఇద్దరు ప్రవాస భారతీయుల కు జాక్ పాట్ తగిలింది.తాజాగా నిర్వహించిన లాటరీ లో చెరో లక్ష గెలుచుకున్నారు.
6.కువైట్ లో ప్రవాస భారతీయుడి మృతి
కువైట్ లో సెల్వరాజ్ అనే ప్రవాస భారతీయుడు అనారోగ్యంతో మృతి చెందాడు.
7.ఎన్.ఆర్.ఐ లకు ఈ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం
ఎన్.ఆర్ ఐ లకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించే ఆలోచనలో ఉన్నట్టు భారత ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
8.అమెరికాలో రోడ్డు ప్రమాదం.హైదరాబాద్ విద్యార్థుల మృతి
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు.ఎదురెదురుగా కార్లు డీ కొట్టుకోవడం తో హైదరాబాద్ కు చెందిన వంశీ కృష్ణ, (23), అతని స్నేహితుడు పవన్ స్వర్ణ (23) మృతి చెందారు.