ఈ మధ్య కాలంలో లిఫ్ట్ సంబంధించి అనేక ఘటనలు చూస్తూనే ఉన్నాము.తొందరపాటు కొంతమందిని అనవసరమైన చిక్కుల్లో పడేస్తే, మరికొందరిని గందరగోళానికి గురిచేస్తుంది.
ముఖ్యంగా, గమ్యస్థానం త్వరగా చేరాలనే ఆతృతలో కొందరు తీసుకునే కొన్ని నిర్ణయాలు చూసి మిగతావారు ఆశ్చర్యపోతుంటారు.తాజాగా, ఓ మహిళ లిఫ్ట్ వద్ద చేసిన పని చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.
సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో, ఓ మహిళ లిఫ్ట్ ముందు వచ్చి బటన్ నొక్కుతుంది.అయితే, డోర్లు తెరుచుకునేలోపు ఓపిక కోల్పోయి పక్కనున్న మరో లిఫ్ట్ వద్దకు వెళ్లి అక్కడ కూడా బటన్ నొక్కుతుంది.
ఇంతలో మొదటి లిఫ్ట్ డోర్లు తెరుచుకున్నా, ఆమె మళ్లీ మొదటిది వదిలేసి రెండో లిఫ్ట్ వద్దకు వెళ్తుంది.
ఈమె ఇలా ఎక్కడా ఓపిక పట్టకుండా.లిఫ్ట్‌లు మారుస్తూ గందరగోళంగా ప్రవర్తించడం చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు.చివరికి ఎలాగోలా లిఫ్ట్‌లోకి ఎక్కిందిగానీ, ఆమె తొందరపాటు తీరు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.
ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
ఈమె జీవితం కూడా ఇలా గందరగోళంగా ఉంది ఉంటుందని కొందరు కామెంట్ చేస్తుండగా.మరికొందరు, అంత తొందరేంటి? లిఫ్ట్ వచ్చే వరకైనా ఓపిక పట్టాలి కదా అని కామెంట్ చేస్తున్నారు.ఇంకొందరి ‘వీడియో చూస్తుంటే నవ్వు ఆపుకోలేకపోతున్నామని కామెంట్ చేస్తున్నారు.ఇంకెందుకు ఆలస్యం ఎంతగానో నవ్విస్తున్న ఈ క్లిప్‌ను మీరు చూసి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలపండి.