దొడ్డి దారిన విదేశాలకు .. 3,225 మంది ట్రావెల్ ఏజెంట్లపై పంజాబ్ సర్కార్ కేసులు

ఆర్ధిక ఇబ్బందులు కావొచ్చు.కుటుంబ సభ్యులకు మెరుగైన జీవితం ఇవ్వాలనే ఆలోచన కావొచ్చు.

 3,225 Travel Agents Booked In Past 3 Years, Says Punjab Nri Affairs Minister Dha-TeluguStop.com

ఏదైతేనేం.భారతీయులు ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని విదేశాలకు వెళ్తున్నారు.

వీరిలో చట్టప్రకారం విదేశాలకు వెళ్లే వాళ్లు కొందరైతే, అక్రమంగా పరాయి దేశంలో అడుగుపెట్టే వారు మరికొందరు.కార్మికులను మభ్యపెట్టి సందర్శకుల పేరిట వారిని ట్రావెల్‌ ఏజెంట్లు తరలించే పద్ధతి ఇప్పటికీ కొనసాగుతోంది.

గడువు ముగిసిన తరవాతా వీరు అక్కడే ఉండిపోతున్నారు.

అక్కడి చట్టాలు కఠినంగా ఉండటంతో వీసాలు, పాస్‌పోర్టులు( Visas and passports ) లేనివారు రహస్యంగా జీవిస్తున్నారు.

భారతీయ కార్మికుల భయం, బలహీనతలను ఆసరాగా తీసుకొని అక్కడి సంస్థలు, యజమానులు వారిని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు.తమ వద్ద పనిచేసేవారి వీసాలు, పాస్‌పోర్టులను బలవంతంగా లాక్కొని వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు.

వీసాలు, పాస్‌పోర్టులు లేకుండా అక్రమంగా ఉండటం వల్ల యాజమానులతో సమస్యల కారణంగా వేలాది మంది భారతీయులు విదేశీ జైళ్లలో మగ్గుతున్నారు.

Telugu Dhaliwal, Punjab, Punjab Nri, Punjabnri, Travel, Visas-Telugu Top Posts

ఇటీవల తమ దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) ప్రభుత్వం అమెరికా నుంచి బహిష్కరించడం ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేసింది.ఈ లిస్ట్‌లో భారతీయులు కూడా ఉన్నారు.మరీ ముఖ్యంగా పంజాబ్ వాసులు పెద్ద సంఖ్యలో బహిష్కరణకు గురయ్యారు.

ఈ నేపథ్యంలో అక్రమంగా విదేశాలకు పంపుతున్న వారిపై పంజాబ్ ప్రభుత్వం( Punjab Govt ) కన్నెర్ర చేసింది.

Telugu Dhaliwal, Punjab, Punjab Nri, Punjabnri, Travel, Visas-Telugu Top Posts

మోసపూరిత ఇమ్మిగ్రేషన్ పద్ధతుల్లో భారతీయులను విదేశాలకు పంపుతున్న ట్రావెల్ ఏజెంట్ల ( Travel agents )ఆటకట్టించేందుకు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్.( Punjab DGP Gaurav Yadav ).నలుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేశారు.దీనికి అదనపు డీజీపీ (ఎన్ఆర్ఐ వ్యవహారాలు) ప్రవీణ్ సిన్హా నేతృత్వం వహిస్తున్నారు.అమెరికా నుంచి బహిష్కరణకు గురైన వ్యక్తులు.ఏజెంట్లు, సంస్థల గురించిన సమాచారాన్ని సిట్‌కు అందించాలని అధికారులు కోరుతున్నారు.ఇప్పటికే పలువురు ట్రావెల్ ఏజెంట్లను అధికారులు అరెస్ట్ చేశారు.

గడిచిన మూడేళ్లలో 3,225 మంది ట్రావెల్ ఏజెంట్లపై కేసులు నమోదైనట్లు పంజాబ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కుల్దీప్ సింగ్ ధాలివాల్ తెలిపారు.పలువురిపై పోలీసులు నిఘా ఉంచారని ఆయన వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube