అసలే వర్షాకాలం కొనసాగుతోంది.ఈ సీజన్‌లో హెయిర్ ఫాల్ బాధితుల పరిస్థితి వర్ణణాతీతం అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఎందుకంటే, మిగిలిన సీజన్లతో పోలిస్తే వర్షాకాలంలో హెయిర్ ఫాల్ మరింత తీవ్రతరంగా మారుతుంది.దాంతో హెయిర్ ఫాల్ ను అడ్డుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటారు.
ఖరీదైన షాంపూలు, నూనెలు, సీరమ్‌లు వాడుతుంటారు.అయినాసరే హెయిర్ ఫాల్ అదుపులోకి రాకుంటే పిచ్చెక్కిపోతుంటారు.
మిమ్మల్ని కూడా హెయిర్ ఫాల్ వేధిస్తుందా? అయితే టెన్షన్ వద్దు.కేవలం ఇప్పుడు చెప్పబోయే మూడు పదార్థాలతో హెయిర్ ఫాల్‌కి చెక్ పెట్టొచ్చు.
మరి ఆ మూడు పదార్థాలు ఏంటి.? వాటిని ఏ విధంగా ఉపయోగించాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక కలబంద ఆకును తీసుకుని వాటర్‌లో శుభ్రంగా కడిగి.
లోపల ఉంటే జెల్‌ను సపరేట్ చేసుకోవాలి.అలాగే రెండు లేదా మూడు అరటి పండ్లను తీసుకుని పీల్ తొలగించి స్లైసెస్‌గా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న అరటి పండు ముక్కలు, ఫ్రెష్ అలోవెర జెల్ వేసుకుని మూడు, నాలుగు నిమిషాల పాటు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్ల ఆముదం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకుని షవర్ క్యాప్ ధరించాలి.గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూను యూజ్ చేసి గోరు వెచ్చని నీటితో శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.
వారంలో రెండు సార్లు ఈ హెయిర్ ప్యాక్ వేసుకుంటే.జుట్టు రాలడం క్రమంగా తగ్గుతుంది.అసలు ఈ న్యాచురల్ హెయిర్ ప్యాక్‌ను ట్రై చేస్తూ ఉంటూ హెయిర్ ఫాల్ అన్న మాటే అనరు.
