పెళ్లి తర్వాత ప్రతి మహిళ పిల్లల కోసం ఆరాట పడుతుంటుంది.పండంటి బిడ్డకు జన్మనివ్వాలని, తన ముద్దుల పాపాయిని పొత్తిల్లోకి తీసుకుని లాలించాలని, అమ్మ అని పిలిపించుకోవాలని తెగ ముచ్చట పడుతూ ఉంటారు.
అయితే కొందరు పెళ్లయిన వెంటనే గర్భం దాల్చుతుంటారు.కానీ కొందరికి మాత్రం పెళ్లై ఎన్నేళ్లు గడుస్తున్నా సంతానం ఉండదు.
ఇలాంటి వారు ఎన్నెన్నో మందులు వాడుతుంటారు.ట్రీట్మెంట్ చేయించుకుంటారు.
మీరు ఈ జాబితాలో ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ను డైట్ లో చేర్చుకోవాల్సిందే.ఈ డ్రింక్ సంతాన లోపాలను నివారించి పిల్లలు త్వరగా కలిగేందుకు ఎంతగానో సహాయపడుతుంది.
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు సైతం అందిస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో నాలుగు ఆప్రికాట్స్, మూడు గింజ తొలగించిన ఖర్జూరాలు వేసి ఒక కప్పు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.అలాగే మరో గిన్నెను తీసుకొని అందులో ఎనిమిది బాదం పప్పులు వేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.
మరుసటి రోజు ఉదయాన్నే బ్లెండర్ తీసుకుని అందులో నానబెట్టుకున్న ఆప్రికట్స్ మరియు ఖర్జూరాలను వాటర్ తో సహా వేసుకోవాలి.అలాగే బాదం పప్పులకు ఉన్న పొట్టు తొలగించి బ్లెండర్‌లో వేసుకోవాలి.

ఇక చివరగా ఒక గ్లాస్ కాచి చల్లార్చిన పాలను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మన టేస్టీ అండ్ హెల్తీ డ్రింక్ సిద్ధం అవుతుంది.ఈ డ్రింక్ ను ఒక గ్లాస్ చొప్పున ప్రతి రోజు మహిళలు తీసుకుంటే.సంతాన లోపల ఏమైనా ఉంటే దూరం అవుతాయి.సంతానోత్పత్తి రెట్టింపు అవుతుంది.దాంతో త్వరగా పిల్లలు కలుగుతారు.పాలిచ్చే తల్లులు సైతం ఈ డ్రింక్ ను తీసుకోవచ్చు.
అంతేకాదు ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల రక్తహీనత బారిన పడకుండా ఉంటారు.కంటి చూపు మెరుగుపడుతుంది.
మరియు జీర్ణ వ్యవస్థ పనితీరు సైతం మెరుగుపడుతుంది.