ఫోన్ రిపేర్ చేస్తుండగా బ్లాస్ట్.. జస్ట్ లో మిస్సయ్యారు!!

సాధారణంగా కొన్ని సార్లు మనం ఊహించని సంఘటనలు ఎదురవుతుంటాయి.అప్పుటివరకు భయాందోళనకు గురైనా.

 Mobile Blast While Repairing Phone In Uttar Pradesh Details, Viral, Video, Uttar-TeluguStop.com

కొంచెంసేపటి తర్వాత పెద్ద గండం నుంచి బయట పడ్డామని ఊపిరి పీల్చుకుంటాం.ఇలాంటి ఘటనలు చాలా రేర్‌గా చూస్తుంటాం.

సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి.ఈ వీడియోను చూసే నెటిజన్లు సైతం కొంచెంసేపటి వరకు ఆశ్చర్యానికి గురవుతారు.

అయితే ఇలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఓ మొబైల్ షాపులో ఫోన్ రిపేర్ చేస్తుండగా ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌లో చోటు చేసుకుంది.

లలిత్‌పూర్‌లోని పాలిలో ఉన్న మొబైల్ షాపునకు కస్టమర్ ఫోన్ తీసుకుని వచ్చాడు.

ఫోన్ ఛార్జింగ్ ఎక్కడం లేదని, ఛార్జింగ్ సమస్యను పరిష్కరించమని మొబైల్ ఫోన్లు రిపేర్ చేసే వ్యక్తికి చెప్పాడు.దీంతో సదరు వ్యక్తి ఆ ఫోన్‌ను చెక్ చేయడం ప్రారంభించాడు.

బ్యాటరీ తీసేందుకు యత్నించాడు.పక్కనున్న స్కూడ్రైవర్‌ను తీసుకెళ్లడానికి తిరిగి ఫోన్‌ను చేతిలో పట్టుకున్న క్రమంలో ఒక్కసారి పెద్ద పేలుడు సంభవించింది.

ఈ బ్లాస్ట్‌ లో అక్కడి ప్రాంతమంట మంటలు చెలరేగాయి.అదృష్టవశాత్తు షాపు యజమాని, కస్టమర్ అక్కడి నుంచి పారిపోవడంతో ప్రమాదం తృటిలో తప్పింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో.షాపు సీసీ టీవీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.మిథిలేష్‌ధర్ అనే వ్యక్తి ట్విట్టర్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశాడు.ఇప్పటివరకు ఈ వీడియోను 21.8కే వ్యూవ్స్ వచ్చాయి.129 మంది రీట్విట్‌లు చేయగా.498 లైకులు వచ్చాయి.అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.ఫోన్లు, గ్యాడ్జెట్లు, కంప్యూటర్లు వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సలహా ఇస్తున్నారు.ప్రమాదం ఎప్పుడైనా జరగవచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube