వేపాకులతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసా?

వేపాకులను మన పూర్వీకుల కాలం నుండి వాడుతూ ఉన్నాం.ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారాన్ని చూపుతుంది.

 Neem Leaves Health Benefits , Neem Leaves, Anti-viral, Anti-bacterial, Neem Powd-TeluguStop.com

దాదాపుగా 4500 సంవత్సరాల క్రిందట నుండే వేపాకులను వైద్యంలో వాడుతున్నారు.ముఖ్యంగా చర్మ సమస్యలకు బాగా సహాయపడుతుంది.

వేపలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం.కొన్ని వేపాకులను టీలో వేసి మరిగించి త్రాగితే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

వేపలో ఉండే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు శరీరంలోకి ప్రవేశించే వైరస్‌లు, బ్యాక్టీరియాలను తరిమి కొట్టి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడతాయి.కొన్ని వేపాకులను శుభ్రంగా కడిగి నీడలో ఆరబెట్టి పొడిగా తయారుచేసుకోవాలి.

ఒక స్పూన్ వేప పొడిలో ఒక స్పూన్ తేనేను కలిపి ప్రతి రోజు తీసుకుంటూ ఉంటే శరీరంలో వ్యర్ధాలు బయటకు పోతాయి.

వేప పొడి అనేది మధుమేహం ఉన్నవారికి చాలా ప్రయోజనకారిగా ఉంటుంది.ప్రతిరోజు ఉదయం, సాయంత్రం,మధ్యాహ్నం భోజనం ముందు ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ వేప పొడిని కలిపి త్రాగితే రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.వేప ఆకులను నమిలిన లేదా పొడిగా తీసుకున్న సరే జీర్ణాశయం, పేగుల్లో ఉండే సూక్ష్మజీవులు నశించి జీర్ణాశయం శుభ్రం అవుతుంది.

దీనితో గ్యాస్, అజీర్ణం, అసిడిటీ, మలబద్దకం,అల్సర్ వంటివి తగ్గిపోతాయి.వేప ఆకులు కొన్నింటిని తీసుకుని బాగా నూరి పేస్ట్‌లా చేయాలి.ఈ మిశ్రమాన్ని కీళ్ల నొప్పులు ఉన్న చోట రాస్తే తక్షణమే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube