తొలి రిపబ్లికన్ ప్రైమరీ డిబేట్‌ తర్వాత నిక్కీ హేలీ దూకుడు .. భారీగా వస్తోన్న విరాళాలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోరు పెరిగింది.రిపబ్లికన్ ప్రైమరీ తొలి డిబేట్ ( Republican primary )తర్వాత దేశంలో ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది.2024 అధ్యక్ష ఎన్నికల్లో భారత మూలాలున్న వ్యక్తులు నేరుగా తలపడుతున్నారు.ఇప్పటికే వివేక్ రామస్వామి, నిక్కీహేలీలు పోటీ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

 Indian Origin Nikki Haley Raises Usd 1 Million In Less Than 3 Days After Gop Deb-TeluguStop.com

వీరితో పాటు వృత్తిరీత్యా ఇంజినీర్ అయిన హర్షవర్థన్ సింగ్ ( Harshavardhan Singh )అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.వీరు ముగ్గురు రిపబ్లికన్ పార్టీకి చెందినవారు కావడం విశేషం.

వీరిలో నిక్కీ హేలీ, వివేక్ రామస్వామిలపైనే ప్రస్తుతం అందరి దృష్టి వుంది.ఫండ్ రైజింగ్ విషయంలోనూ భారత సంతతి నేతలు దూసుకెళ్తున్నారు.

తాజాగా నిక్కీ హేలీ ఈ విషయంలో మంచి పనితీరు కనబరుస్తున్నారు.

రిపబ్లికన్ ప్రైమరీ తొలి డిబేట్ ముగిసిన 72 గంటల వ్యవధిలో 1 మిలియన్ డాలర్లకు పైగా సేకరించింది.

ఈ మేరకు నిక్కీ హేలీ( Nikki Haley _ ప్రచార బృందం సోమవారం ప్రకటించింది.నిన్న సౌత్ కరోలినాలో తన మద్ధతుదారులతో నిక్కీ హేలీ భారీ ర్యాలీ నిర్వహించారు.

ఇండియన్ ల్యాండ్‌లోని హేలీస్ టౌన్ హాల్‌కి పెద్ద ఎత్తున సౌత్ కరోలినియన్లు తరలివచ్చారు.ఓటర్లను ఒక్కొక్కరిగా పలకరిస్తూ ఆలస్యంగా వేదిక మీదకు వచ్చారు నిక్కీ హేలీ.అనంతరం ఆమె మాట్లాడుతూ.చైనా, రష్యా మధ్య భాగస్వామ్యంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

చైనా.అమెరికాతో కొన్నేళ్లుగా యుద్ధానికి ప్లాన్ చేస్తోందన్నారు.

Telugu Gop, Usd, Vivek Ramaswamy-Telugu NRI

గత వారం జరిగిన తొలి ప్రెసిడెన్షియల్ ప్రైమరీ డిబేట్ ( first presidential primary debate )తర్వాత మాజీ సౌత్ కరోలినా గవర్నర్ నిక్కీ హేలీకి ప్రజాదరణ పెరిగింది.అయితే ఈ సమయంలో నిక్కీ, వివేక్‌లు మాత్రం తొలి డిబేట్‌లో కత్తులు దూసుకున్నారు.30 సెకన్ల పాటు బిగ్గరగా అరుస్తూ.వేళ్లూ చూపిస్తూ వార్నింగ్ ఇచ్చే వరకు వెళ్లారు.

విదేశాంగ విధానాలపై వివేక్‌కు అవగాహన లేదని నిక్కీ పదునైన విమర్శలు చేశారు.ఉక్రెయిన్‌ను రష్యాకు అప్పగించాలని ఆయన చెబుతున్నారని.

తైవాన్‌ను చైనా మింగేయాలని , ఇజ్రాయెల్‌కు సాయం ఆపేయాలని అంటున్నారని మిత్రదేశాల పట్ల ఇలాంటి వైఖరి మంచిది కాదని నిక్కీ హేలీ అన్నారు.

Telugu Gop, Usd, Vivek Ramaswamy-Telugu NRI

అయితే ఆమె వ్యాఖ్యలకు గట్టి కౌంటరిచ్చారు వివేక్ రామస్వామి( Vivek Ramaswamy ).ఉక్రెయిన్‌కు అమెరికా అధిక సాయం అందించడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు.రక్షణ రంగానికి చెందిన కొన్ని కంపెనీల కారణంగా నిక్కీ ఉక్రెయిన్‌కు మద్ధతు తెలుపుతున్నారని వివేక్ ఆరోపించారు.

విదేశాంగ విధానం విషయంలో రిపబ్లికన్ పార్టీకి చెందిన కొందరు బైడెన్‌కు అండగా నిలుస్తున్నారని ఆయన పేర్కొన్నారు.అలా రిపబ్లికన్ ప్రైమరీ తొలి డిబేట్ వాడివేడిగా సాగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube