తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి( Mega Family ) చాలా మంచి గుర్తింపైతే ఉంది.మరి ఈ ఫ్యామిలీ నుంచి 2025వ సంవత్సరంలో అందరు హీరోలు వాళ్ళ సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు.
ఇక ఎలాంటి సినిమాలతో సక్సెస్ లను సాధిస్తారనేది తెలియాల్సి ఉంది.అయితే ఈ సంవత్సరం ఈ ఫ్యామిలీ నుంచి ఏ హీరో రాకపోవడంతో మెగా ఫ్యాన్స్ కొంతవరకు నిరాశ చెందారు.
కానీ వచ్చే సంవత్సరంలో మాత్రం ఈ ఫ్యామిలీ నుంచి హీరోలు ఒకేసారి ఇండస్ట్రీ మీద దండయాత్ర చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.ఇక అందులో భాగంగానే పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సైతం ఈ సినిమాలతో భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు.

అయితే హరీష్ శంకర్ తో( Harish Shankar ) ఆయన చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్( Ustaad Bhagat Singh ) సినిమాకి సంబంధించిన కథను మార్చమని పవన్ కళ్యాణ్ హరీష్ కి చెప్పారట.ఎందుకంటే ఎలక్షన్స్ కి ముందు హరీష్ శంకర్ అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ పార్టీని( YCP Party ) ఉద్దేశించి కొన్ని సీన్స్ అయితే రాశాడు.మరి ఇప్పుడు కూడా ఆ సీన్స్ ని వాడడం వల్ల పెద్దగా యూజ్ అయితే ఉండదని పవన్ కళ్యాణ్ అనుకున్నారట.

అందుకోసమే వాటిని మార్చి వాటి ప్లేస్ లో మరికొన్ని సీన్లతో రీప్లేస్ చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలని హరిష్ శంకర్ కు చెప్పారట.ఇక ఆయన కూడా అదే పనిలో ఉన్నట్టుగా తెలుస్తోంది.మరి మొత్తానికైతే వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా గబ్బర్ సింగ్ మాదిరిగానే మంచి విజయాన్ని సాధిస్తుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ప్రస్తుతానికైతే చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
మరి ఇప్పుడు మెగా హీరోలు కూడా తమదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు…
.