సహదేవుడు పాండవులలో చివరివాడు.చాలా సుకుమారుడు.
అందుచేత అరణ్య వాసానికి పోయే సమయంలో కుంతి ఎంతో ఆవేదన చెందుతుంది.ద్రౌపదికి సహదేవుని స్వభావాన్ని వివరించి చెబుతుంది.
తనను జాగ్రత్తగా చూసుకోవాలని సూచిస్తుంది.సహదేవుడు పాండురాజు కుమారుడు.
అశ్వినీదేవతల అంశలో నకుల సహదేవులిద్దరూ జన్మించారు.మాద్రి భర్తతో సహగమనం చేసింది.
నకుల సహదేవులను కుంతీదేవి ధర్మజాదులతో సహా పెంచింది.స్వయంవరంలో సహ దేవునికి లభించిన భార్య పేరు విజయ.
సహదేవునికి విజయకు పుట్టిన కుమారుని పేరు సుహోమత్రుడు.సహదేవునికి ద్రౌపదికి పుట్టిన కుమారుడి పేరు శ్రుతసేనుడు.
రాజసూయ యాగానికి ముందు సహదేవుడు దక్షిణ దిక్కులోని రాజులను జయించి ఆ రాజ్యాలను గెలుచుకుంటాడు.యాగంలో శిశు పాలుడు కృష్ణుని పూజను విమర్శించినప్పుడు సహదేవుడు ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.
కృష్ణుని తిట్టిన వారి తలపై కాలు మోపు తానని కాలు పైకెత్తాడు.అప్పుడు సదస్సులు భయపడ్డారు.
కురుక్షేత్ర యుద్ధంలో ఇతడు ఉలూకుడు మొదలైన కౌరవపక్షీయులను సంహరించాడు.సహదేవుడు వయసులో చిన్నవాడైనా ప్రజ్ఞా వంతుడు.
సహ దేవునికి తాను జ్ఞాని అనే గర్వం ఎక్కువగా ఉంటుంది.మహా భారత చెప్పిన సమయంలో చాలా సందర్భాల్లో అది బయట పడింది.సహ దేవునిలో ఉన్నది ఇదొక్కటే దోషమని చెబుతారు.మహా ప్రస్థాన సమయంలో సహ దేవుడు ప్రాణ రహితుడై పడిపోయినప్పుడు ధర్మా రాజు ఒక మాట అంటాడు.
సహ దేవునిలో ఉన్నవన్నీ మంచి గుణాలే ఒక్క గర్వమే అతనిలో ఉన్న దేశమని చెబుతాడు.