ఎప్పటి నుండో ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో మేజర్ ఒకటి.ఈ సినిమాను మహేష్ బాబు తన సొంత నిర్మాణ సంస్థ అయినా జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ తో కలిపి నిర్మించాడు.
మహేష్ బాబు ఈ సినిమాలో భాగం కావడంతో ముందు నుండి మహేష్ అభిమానులు సైతం ఈ సినిమాపై ద్రుష్టి పెట్టారు.అయితే ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుంది.
కరోనా కారణంగా ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది.ఎన్నో రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు విడుదల అయ్యేందుకు రెడీ అయ్యింది.జూన్ 3న మేజర్ సినిమా రిలీజ్ కాబోతుంది.దీంతో మేకర్స్ ప్రొమోషన్స్ కూడా స్టార్ట్ చేసారు.
ఈ సినిమాలో టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్ హీరోగా నటించాడు.
శశి కిరణ్ తిక్క దర్వకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలను నెలకొల్పింది.
ఇప్పటి వరకు ఇండియన్ సినిమా దగ్గర ఏ సినిమా చేయని విధంగా రిలీజ్ కు ముందే ప్రీమియర్స్ షో వేశారు.వైజాగ్ లో ఈ ప్రీమియర్ షో వేశారు.
ఈ ప్రీమియర్ షో అనంతరం ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.ఈ వేడుకకు భారీ సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారు.
ఈ సినిమా ప్రీమియర్ షో చుసిన వారంతా మంచి పాజిటివ్ టాక్ ఇవ్వడంతో అడవి శేష్ సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ చేసాడు.వైజాగ్ కు మన సినిమా నచ్చింది.ఇది అతి పెద్ద మూమెంట్.బ్లాక్ బస్టర్ రివ్యూ.హానెస్ట్ మూమెంట్ అని చెప్పుకొస్తూ సూపర్ స్టార్ మహేష్ బాబు ను సైతం ట్యాగ్ చేసాడు.ఈ పోస్ట్ పై మహేష్ కూడా స్పందించారు.
నాకు నచినట్టుగానే, వాళ్లకు నచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను.అంటూ చెప్పారు మహేష్.ఈయన ఆనందం చూసి మహేష్ ఫ్యాన్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే వచ్చిన టాక్ తో ఈ సినిమా హిట్ గ్యారెంటీ అని తెలుస్తుంది.హీరోగా సూపర్ స్టార్ గా ఎదిగిన మహేష్ బాబు నిర్మాతగా కూడా సక్సెస్ సాధించినట్టే అంటున్నారు.మరి ఈ సినిమా రిజల్ట్ గురించి తెలియాలంటే మరొక మూడు రోజులు ఆగాల్సిందే.