జూనియర్ ఎన్టీఆర్నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు మనువడిగా అదే చరిష్మా అదే పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు జూనియర్ ఎన్టీఆర్.ఇక తక్కువ సమయంలోనే ఊహించని రేంజిలో మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే.
ఇక ఒక్కసారిగా స్టార్ హీరోగా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత కెరీర్ లో ఫ్లాపులతో సతమతమయ్యాడు.చూడాలని ఉంది అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది.
ఇక అటు వెంటనే వచ్చినా ఆది, సింహాద్రి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాదు ఇండస్ట్రీ రికార్డులను కూడా తిరగరాసాయ్.ఒక్కసారిగా ఎన్టీఆర్ను మాస్ ప్రేక్షకులకు దగ్గర చేసాయ్.
ఇలా స్టూడెంట్ నెంబర్ వన్, ఆది, సింహాద్రి లాంటి వరుస సినిమాలతో ఫుల్ జోష్ తో దూసుకుపోతున్న సమయంలో అందరు నిర్మాతలు ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు క్యూ కట్టారు అని చెప్పాలి.ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ ఆంధ్రావాలా కథతో జూనియర్ ఎన్టీఆర్ దగ్గరకు వచ్చాడు.
ఎన్టీఆర్ కు కూడా బాగా నచ్చింది.కానీ ఆ తర్వాత ఎక్కడో తేడా కొట్టి చివరికి డిజాస్టర్గా మిగిలిపోయింది.
అయితే ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ అటు ఎగ్జిబిటర్లకు మాత్రం నష్టాలు మాత్రం రాలేదు అని చెప్పాలి.

ఇక ఎన్టీఆర్ కెరియర్లో అట్టర్ ఫ్లాప్ గా నిలిచిన ఆంధ్రావాలా సినిమా స్టొరీ ని ముందుగా దర్శకుడు పూరి జగన్నాథ్ మెగాస్టార్ చిరంజీవి కి వినిపించాడట.చిరంజీవికి ఈ కథ నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశారట.దీంతో అటు తిరిగి ఇటు తిరిగి ఎన్టీఆర్ దగ్గరికి ఈ పాత్ర వచ్చింది.
కానీ ఎందుకో ఈ సినిమాలో ఎన్టీఆర్ కు ప్రేక్షకుల ఆదరణ తక్కువైపోతుంది.దీంతో సినిమా డిజాస్టర్గా నిలిచింది.
అయితే 2004లో ఈ సినిమా విడుదల కాగా ఇదే ఏడాది మెగాస్టార్ అంజి.బాలకృష్ణ లక్ష్మీనరసింహ ప్రభాస్ వర్షం సినిమాలు కూడా విడుదలయ్యాయి.
ఇక అన్ని సినిమాల్లో కేవలం బాలయ్య లక్ష్మీనరసింహ ప్రభాస్ వర్షం సినిమాలు మాత్రమే మంచి విజయాలు సాధించాయి.