Shukra Hora Puja : శుక్రవారం నాడు శుక్ర హోర పూజ ఎలా చేయాలో తెలుసా..?

ముఖ్యంగా చెప్పాలంటే ప్రస్తుత సమాజంలోని దాదాపు చాలా మంది ప్రజలు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు.అందులోని ముఖ్యమైన సమస్య, ఆర్థిక సమస్య అని కచ్చితంగా చెప్పవచ్చు.

 Do You Know How To Do Shukra Hora Puja On Friday-TeluguStop.com

అలాగే శుక్రవారం ఉదయం ఆరు గంటలకు శుక్రవారం మొదలవుతుంది.అలాగే మధ్యాహ్నము ఒక గంట నుంచి రెండు గంటల వరకు అలాగే రాత్రి 8 నుంచి 9 గంటల వరకు శుక్ర హోరాగా భావిస్తారు.

ఈ సమయంలో శ్రీ లక్ష్మి( Sri Lakshmi )ని పూజించేవారికి సర్వ సుఖాలు లభిస్తాయి.ముఖ్యంగా రుణ సమస్యలతో బాధపడేవారు, రుణం ఇవ్వలేక ఇబ్బంది పడేవారు, రుణం ఇచ్చి తిరిగి పొందలేని వారు, వృత్తిలో లాభాలు ఆశించేవారు ఈ హోరా సమయంలో మహా లక్ష్మీదేవి( Maha Lakshmi )ని పూజించడం వల్ల వ్యాపార అభివృద్ధి జరుగుతుంది.

అలాగే ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి త్వరగా బయటపడతారు.శుక్రవారం రోజున శుక్ర హోర పూజలు( Shukra Hora ) చేసే వారికి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం ద్వారా అప్పుల సమస్య తీరిపోతుంది.అలాగే ఇచ్చిన అప్పు తిరిగి వస్తుంది.ఈ హోరా సమయంలో ఉప్పు కొనుగోలు చేసి పూజ గదిలో ఉంచి పూజ చేసిన తర్వాత ఉప్పు జాడిలో భద్రపరుచుకోవాలి.

అందులో ఐదు రూపాయల నాణాన్ని ఉంచాలి.అయితే శనివారం ఉప్పు కొనకూడదు.

ఇలా చేస్తే వ్యాపారంలో నష్టం వస్తుంది.శుక్రవారం ఉదయం లేదా సాయంత్రం తిరుమల( Tirumala ) వారి దేవాలయంలో పెరుమాళ్ళ వారికి అభిషేకానికి పాలు అందజేస్తే ఆదాయం పెరుగుతుంది.ఇంకా పచ్చ రంగు మట్టి గాజులను శ్రీలక్ష్మికి ఇవ్వడం వల్ల ఆర్థిక సమస్యలు దూరమవుతాయి.ఇలా 24 శుక్రవారాలు అభిషేకానికి పాలు అందజేయడం ద్వారా కోటీశ్వరులు అవుతారని పండితులు చెబుతున్నారు.

కాబట్టి వెంటనే పై సమస్యలతో బాధపడుతున్న వారు ఈ విధంగా చేసి మీ సమస్యలను దూరం చేసుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube