20 నిమిషాలు వాకింగ్ తో పాటు నిత్యం ఈ జ్యూస్ తాగితే మల్లె తీగలా మారిపోతారు!

ఆహారపు అలవాట్లు, శరీరానికి శ్రమ లేకపోవడం, ఒత్తిడి, నిద్రను నిర్లక్ష్యం చేయడం, దీర్ఘకాలిక వ్యాధులు, పలు రకాల మందులు వాడకం తదితర కారణాల వల్ల ప్రస్తుత రోజుల్లో ఆడ మగ అనే తేడా లేకుండా ఎంతో మంది అధిక బరువు( overweight ) బారిన పడుతున్నారు.అయితే కొందరు పెరిగిన బరువును నిర్లక్ష్యం చేస్తే.

 If You Drink This Juice Regularly, You Will Lose Weight! Weight Loss, Weight Los-TeluguStop.com

మరి కొందరు ఆ బరువును తగ్గించుకునేందుకు తాపత్రయపడుతున్నారు.మీరు కనుక రెండో క్యాటగిరిలో ఉంటే ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ మీకు చాలా బాగా సహాయపడుతుంది.

ఈ జ్యూస్ రెగ్యులర్‌గా తీసుకోవడంతో పాటు 20 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే బరువు తగ్గి మీరు మల్లె తీగలా మారతారు.మరి ఇంతకీ వెయిట్ లాస్ కు సహాయపడే ఆ జ్యూస్ ఏంటి దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఓ లుక్కేసేయండి.

Telugu Tips, Healthy, Regularly, Latest, Lose-Telugu Health

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ కాస్త హీట్ అయ్యాక ఒక స్పూన్ గ్రీన్ టీ ఆకులు( Green tea leaves ), అంగుళం దాల్చిన చెక్క వేసి ప‌ది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత తయారు చేసుకున్న గ్రీన్ టీను ఫిల్టర్ చేసుకుని చల్లార బెట్టుకోవాలి.ఈలోపు మిక్సీ జార్ లో అర కప్పు కీర దోసకాయ ముక్కలు( Green cucumber slices ), అర కప్పు పైనాపిల్ ముక్కలు( Slices of pineapple ), వన్ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు( Ginger slices ) మరియు అరకప్పు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న‌ మిశ్రమం నుంచి స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

Telugu Tips, Healthy, Regularly, Latest, Lose-Telugu Health

ఈ జ్యూస్ లో చల్లారబెట్టుకున్న గ్రీన్ టీ మరియు తేనె కలిపి తాగేయడమే.ఉదయం లేదా సాయంత్రం వేళ ఈ జ్యూస్ ను తీసుకోవచ్చు.రెగ్యులర్ గా ఈ జ్యూస్ ను తీసుకోవడంతో పాటు 20 నిమిషాలు వాకింగ్ లేదా మీకు నచ్చిన వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి.

అలాగే ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, డీప్ ఫ్రై చేసిన ఆహారాలు, షుగర్, మైదా, కూల్ డ్రింక్స్ వంటి వాటికి దూరంగా ఉండండి.కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, నట్స్, సీడ్స్ ను ఆహారంలో భాగం చేసుకోండి.

ఈ చిన్న చిన్న మార్పులతో చాలా సులభంగా పెరిగిన బ‌రువును తగ్గించుకోవచ్చు.ముఖ్యంగా పైన చెప్పిన జ్యూస్ వెయిట్ లాస్ కు అద్భుతంగా పడుతుంది.

అనేక జబ్బులకు అడ్డుకట్ట వేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube