సాధారణంగా ప్రతి ఇంటిలో తులసి మొక్క తప్పనిసరిగా ఉంటుంది.అలాగే మనం తులసి మొక్కకు ఇచ్చిన ప్రాధాన్యత ఏ మొక్కకు ఇవ్వం.
అంతేకాక తులసి మొక్కను మనం దైవంగా భావిస్తాం.తులసి మొక్క విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైనది కావటంతో లక్ష్మి స్వరూపంగా భావించి పూజలు చేస్తాం.
అంతేకాకుండా తులసి వలన మనకు అనేక ఆరోగ్యపరమైన లాభాలు ఉన్నాయి.
తులసి మొక్కకు ఉన్న మరో విశిష్ట గుణం ఏమిటంటే కార్బన్ డై ఆక్సైడ్ ను తీసుకోని మనకు అవసరమైన ప్రాణ వాయువు ఆక్సిజన్ ని విడుదల చేస్తుంది.
ప్రతి ఆలయంలో తీర్ధంలో తప్పనిసరిగా తులసిని వేయటం చూస్తూనే ఉంటాం.అలాగే దేవుడికి తులసి మాలలను వేయటం కూడా చూస్తూనే ఉంటాం.
అలాగే దగ్గు,జలుబు చేసినప్పుడు రెండు తులసి ఆకులను నమిలితే వెంటనే తగ్గిపోతాయి.తులసి వనం మీదగా వీచే గాలిని కనుక రోజూ పీల్చినట్లయితే జీవితకాలం మొత్తం మీద కూడా ఎటువంటి జబ్బులూ రావని మన పెద్దవారు చెప్పుతూ ఉంటారు.
మన ఇళ్లల్లో విరివిగా తులసి చెట్లని పెంచేసుకుంటే పుణ్యానికి పుణ్యం, ఆరోగ్యానికి ఆరోగ్యం…