ముఖ్యంగా చెప్పాలంటే విశ్వాసానికి ప్రతికలైన కుక్కలను( Dogs ) ఇంట్లో పెంచుకోవచ్చా? పెంచుకుంటే ఏం జరుగుతుంది?అలాగే కుక్కలు ఏడిస్తే( Dogs Crying ) ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.పూర్వం నుంచి కూడా మూగజీవులని పెంచడం అదృష్టమే అని పండితుల వారు చెబుతున్నారు.
ఇంకా కుక్కలను ఇంట్లో పెంచుకోవడం వల్ల లాభాలే కానీ నష్టాలు ఉండవు.జంతువుల్లో అత్యంత విశ్వాసం కలిగిన కుక్కలు ప్రజలకు బెస్ట్ ఫ్రెండ్ అని కూడా చెబుతూ ఉంటారు.
కుక్కలు అరిస్తే పెద్దగా పట్టించుకోని ప్రజలు, అది ఏడిస్తే మాత్రం భయపడిపోతూ ఉంటారు.
అది వీదీ లో కుక్క అయినా సరే, ఇంట్లో కుక్క ఒక అయినా సరే భయపడడం మాత్రం జరుగుతూ ఉంటుంది.
దీనికి ఏమైనా కారణాలు ఉన్నాయా అంటే ఏమీ లేవని పండితులు చెబుతున్నారు.కానీ ప్రజలలో ఈ నమ్మకం మాత్రం బలంగా ముద్ర పడిపోయింది.ఈ నమ్మకాన్ని దూరం చేయడానికి చాలా మంది పరిశోధకులు కూడా పరిశోధనలు చేశారు.కానీ ఈ మూఢనమ్మకాన్ని ప్రజల నుంచి దూరం చేయలేకపోయారు.

కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉంటాయని చాలామంది నమ్ముతారు.గ్రీకు నుంచి ఈ సాంప్రదాయం వచ్చింది.దయ్యాన్ని( Ghosts ) కనిపెట్టగలమని, చూడగలమని గ్రీకు ప్రజలు బలంగా నమ్ముతారు.కుక్కలు ఏడిస్తే ఎవరో చనిపోతారు అనుకోవడం కూడా వారి నుంచే మొదలైంది.వాళ్ళు దీన్ని ఏ ఆధారంగా ఈ నమ్మకాన్ని పెంచుకున్నారో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు.ఆధునికంలో కూడా కొందరు ఇలాంటి ఆచారాలను సమర్థిస్తూ ఉన్నారు.
అలాగే ఒక అరుస్తూ ఉన్న, ఏడుస్తున్న అది కచ్చితంగా భూతాన్ని చూసి ఉంటుందని నమ్మేవారు కూడా ఉన్నారు.అంత శక్తి ఉన్న కుక్కలు చావుని పసిగట్టడంలో వింత ఏముంది అనేవారు కూడా ఉన్నారు.

శాస్త్రవేత్తల ప్రకారం దయ్యాన్ని కనిపెట్టడం, చూడడం, ఇటువంటివన్నీ మూఢనమ్మకాలే అని చెబుతున్నారు.చావుకు దగ్గరలో ఉన్న మనిషి శరీరపు వాసన, గాలి ద్వారా కుక్కలు అంచనా వేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.వాసన ను పసిగట్టి ఎలాగైతే దొంగల్ని పట్టుకుంటాయో అదే విధంగా మానవులకు కనిపించని దివ్య శక్తులు, దుష్టశక్తులు వాటికి కనిపిస్తాయని చాలామంది నమ్ముతారు.అలాగే కుక్కలకు ఏవో తెలియని శక్తులు ఉన్నాయని దొరికి ప్రజలు నమ్ముతారు.