ఈ ఒక్క బాటిల్ ని రోజు కొద్దిగా తాగితే, 15 రోగాలు మీ దరికి రావు

సర్వరోగ నివారిణి అనే పేరుతో మార్కెట్‌లో చాలా మందులు దొరుకుతాయి.అవి డాక్టర్లు అప్రూవ్ చేసినవా, అసలు ఏ కంపెనీ తయారుచేస్తోంది, ఆ కంపెని మందులని కనీసం ఆర్ ఎమ్ పి డాక్టర్స్ అయినా రికమెండ్ చేస్తున్నారా లేదా, ఇవేమి పట్టించుకోకుండా కొనేస్తుంటారు జనాలు.

 Use Apple Cider Vinegar To Stay Away From These Fifteen Diseases , Apple Cider V-TeluguStop.com

అసలు ఈ సర్వరోగ నివారిణి అంటే ఏంటి? ఆ మందు కంపోజిషన్ ఏంటి? ఏ ఆసిడ్ ఎంత పరిమాణంలో ఉంటుంది? ఏ మినరల్ ఎక్కువగా వాడారు? ఇలాంటి విషయాల గురించి ఒక్క నిమిషం అయినా ఆలోచిస్తారా అంటే లేదనే చెప్పాలి.మరి ఇంతటి అజ్ఞానం, అలసత్వం ఎందుకు మనకు?.

ఇప్పుడు మీకు పరిచయం చేయబోయే ముందుని సర్వరోగ నివారిణి అనలేమి కాని, ఎంత కదాన్నా 15-20 సమస్యల నుంచి మీ శరీరాన్ని కాపాడుతుంది ఇది‌.దాని పేరే ఆపిల్ సైడర్ వెనిగర్.

పేరు అల్రెడి వినే ఉంటారు‌.ఏమిటి ఇది? ఎలా తాయారుచేస్తారు? వేటితో తయారుచేస్తారు? మనకి అనుకూలమైన ధరలోనే లభ్యం అవుతుందా? చెప్తాం, అన్ని చెప్తాం.

ముందుగా ధర గురించి మాట్లాడుకుంటే, రూ.350 నుంచి మొదలు నాణ్యత గల ఆపిల్ సైడర్ వెనిగర్ బాటిల్స్ దొరుకుతాయి.రూ.1000 – రూ.2000 మధ్యలో కూడా ధరలు ఉంటాయి.అందులో తక్కువ ధరలో నాణ్యతని అందిస్తున్నవారు Apollo Pharmacy వారు.500 ml బాటిల్ ని కేవలం రూ.360 కే అమ్ముతున్నారు.ఇక్కడ ధర మాత్రమే కాదు, ఈ బాటిల్ ని సజెస్ట్ చేయడానికి మరో కారణం Apollo brand.జనాలకి తెలిసిన మందుల కంపెనీ కదా.కొనడానికి ముందు సంకోచించాల్సిన పని లేదు.

ఇక దీని కంపోజిషన్ విషయానికొస్తే, ప్రతి 100 ml కి, 5.48 కాలరీలు, 1.37 mg కార్బోహైడ్రేట్లు, 99.97 mg పొటాషియం, 25.10 mg సోడియం, 5.08 mg కాల్షియం మరియు 12.39 mg ఫాస్ ఫరస్ ఉంటుంది ‌.

దీన్ని ఎలా తయారు చేస్తారు అంటే, అపిల్ పండ్లు, షుగర్‌ మరియు బ్యాక్టీరియా కలిపి.Fermentation (మద్యం తయారు చేసే పద్దతి) ప్రాసెస్ లోనే దీన్ని తయారుచేస్తారు‌.

మొదట షుగర్ ని అల్కాహాల్ గా మార్చి, ఆ తరువాత ఆ ఆల్కహాల్ ని వెనిగర్ గా మారుస్తారు.సింపుల్ గా చెప్పాలంటే, ఆపిల్ పండ్లతో చేసిన వైన్ అన్నమాట.

కాని ఇందులో ఆల్కహాల్ ఉండదు.Acetic acid మరియు malic acid వలన రుచి తియ్యగా ఉండదు.

దీని గురించి పూర్తిగా తెలుసుకున్నారు కదా? మరి దీన్ని రోజు తాగితే శరీరానికి ఎన్ని రకాలుగా మేలో చూడండి.

* డయాబెటిస్ పెషెంట్లు రోజుకు రెండు టీ స్పూన్ల వెనిగర్ సగం గ్లాసు నీళ్ళలో కలిపి తాగితే బ్లడ్ షుగర్ లెవల్స్ మెల్లిగా పడిపోతుంటాయి.

ఇది నిజంగానే నిజం.

* సహజంగానే అన్నిరకాల వెనిగర్ లలో అసెటిక్ ఆసిడ్ ఉంటుంది.ఇది బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేస్తుంది.ఈ స్టేట్మెంట్ వెనుక 2001 భారి ఎత్తున బ్రిటన్ లో జరిగిన ఒక రిసెర్చి సాక్ష్యం.

* జ్వరం, జలుబు లేదా దగ్గు లాంటి ఇంఫెక్షన్లు వచ్చినప్పుడు మన శరీరంలోని pH లెవల్స్ పడిపోతాయి.అందుకే కోలుకోవడానికి కూడా సమయం పడుతుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్ pH బ్యాలెన్స్ ని తిరిగి తీసుకువచ్చి, ఇంఫెక్షన్స్ ని తగ్గిస్తుంది.

* మన రక్తంలో పేరుకుపోయి ఉండే టాక్సిన్స్ ని, మెటల్స్ ని కూడా బయటకి తీస్తుంది ఇది.దీన్ని ఇన్నర్ క్లీన్సర్ అని అందుకే అంటారు.

* దూదిని ఆపిల్ సైడర్ వెనిగర్ లో ముంచి రోజు ఓ అయిదు నిమిషాలు మీ ముఖానికి మర్దన చేసుకుంటే చర్మం కాంతివంతంగా తయారు అవుతుంది.

ఇది స్కిన్ టోనర్ గా కూడా పనిచేస్తుంది.చర్మం మీద దుమ్ము ధుళి పొగొట్టే సులువైన మార్గం ఇది.

* దీన్ని స్నానానికి ముందు జుట్టుకి పోసుకునే, ఓ పది‌ నిమిషాల తరువాత స్నానం చేస్తే జట్టుకి నిగారింపు రావడమే కాదు, డాండ్రఫ్ లాంటి సమస్యలు కూడా దగ్గరికి రావు.

* నోటి దుర్వాసన తో ఇబ్బంది పడేవారు దీన్ని మౌత్ వాషర్ లా కూడా వాడుకోవచ్చు.

అయితే నీటితో కలిపి మాత్రమే వాడండి.దుర్వాసన దూరమవుతుంది.

మిగతా లాభాలు :

* మొటిమలని శరీరం లోపలి నుంచి, బయటినుండి కంట్రోల్ చేస్తుంది.* క్యాన్సర్ సెల్స్ ని చంపుతుంది.

* పండ్లు, కూరగాయలను బ్యాక్టీరియా నుంచి కాపాడుతుంది.* పుండ్లు, పొక్కులపై పనిచేస్తుంది.

* బరువు తగ్గటానికి ఉపయోగపడుతుంది.* కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడకుండా అడ్డుకుంటుంది.

నోట్ : ఉదయం, ఏమి తినకముందే, సగం గ్లాసు మంచినీటిలో రెండు స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ తాగడం అలవాటు చేసుకోండి.

Use Apple Cider Vinegar To Stay Away From These Fifteen Diseases , Apple Cider Vinegar, Acetic Acid, Malic Acid, Blood Pressure, Skin Toner - Telugu Acetic Acid, Applecider, Pressure, Malic Acid, Skin

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube