కెనడాలో భారత సంతతి వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.ఈ హత్య వెనుక మాదక ద్రవ్యాలను స్మగ్లింగ్ చేసే ముఠాల ప్రమేయం వుండొచ్చని స్థానిక పోలీసులు అనుమానిస్తున్నారు.
అతనిని మన్‌దీన్ సింగ్‌గా గుర్తించారు.ఇతను 2016లో కెనడా నుంచి బహిష్కరణకు గురై భారత్‌కు చేరుకున్నాడు.
ఆ తర్వాత డ్రగ్స్ కేసులో డీఆర్‌ఐ మన్‌దీప్‌ని అరెస్ట్ చేసింది.ఈ క్రమంలో గత శుక్రవారం కెనడాలోని ఫుకెట్‌లో మన్‌దీప్ అద్దెకుంటున్న విల్లాలో ఇద్దరు గుర్తు తెలియని దుండగులు అతనిని కాల్చి చంపారు.గోవాలో మాదక ద్రవ్యాలు స్వాధీనం అవ్వడంతో పాటు ఐదేళ్ల క్రితం బ్రిటీష్ కొలంబియాలో డ్రగ్స్ గ్యాంగ్‌ల ఘర్షణతో మన్‌దీప్ హత్యకు సంబంధాలు వున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
1990లో చెన్నైలో జన్మించిన మన్‌దీప్ సింగ్ కుటుంబం అతనికి ఏడేళ్ల వయసు వుండగా కెనడాకు వలస వచ్చింది.మన్‌దీప్ 20 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత డ్రగ్స్ గ్యాంగ్‌లతో తిరిగినట్లుగా తెలుస్తోంది.అతనిని ఆ సమయంలో స్లైస్ సంధు అనే పేరుతో పిలిచేవారట.2010-12 మధ్య కాలంలో మన్‌దీప్ అనేక దాడులు, గ్యాంగ్‌వార్‌లలో పాల్గొన్నాడు.2015లో అబాట్స్‌ఫోర్డ్ పోలీసులు ఒక నోటిఫికేషన్ ద్వారా.సంధు, అతని గ్యాంగ్‌కు దూరంగా వుండాలని స్థానికుల్ని హెచ్చరించారంటే మన్‌దీప్ నేరాలు ఏ స్థాయిలో వున్నాయో అర్ధం చేసుకోవచ్చు.
అయితే తర్వాతి కాలంలో నేర ప్రపంచాన్ని వదిలిపెట్టిన మన్‌దీప్ వివాహం చేసుకుని సాధారణ వ్యక్తిలా జీవిస్తున్నాడు.
ఈ క్రమంలోనే 2015లో కెనడా ఇమ్మిగ్రేషన్ అధికారులు అతనిని భారత్‌కు బహిష్కరించారు.భారత్‌కు చేరుకున్న అనంతరం మన్‌దీప్ తనపేరును జిమ్మీ సంధుగా మార్చుకున్నాడు.తర్వాత గోవాలో విజయ్ ఇండస్ట్రీస్ అనే ఫ్యాక్టరీని స్థాపించి.అందులో సైకోట్రోపిక్ డ్రగ్స్, కెటామైన్ తయారీకి ఉపయోగించే మందును ఉత్పత్తి చేసేవాడు.
జూన్ 2018లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) పాన్ ఇండియా స్థాయిలో కెటామైన్ రాకెట్‌ను ఛేదించింది.ఇద్దరు బ్రిటీషర్లు, ఒక వియత్నాం పౌరుడు సహా 11 మందిని అదుపులోకి తీసుకుంది.
ఈ సందర్భంగా 308 కిలోల కెటామైన్‌ను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.అలాగే 200 కిలోల కెటామైన్‌ను తయారు చేసేందుకు సరిపోయే దాదాపు 2000 కిలోల ముడిసరుకును కూడా డీఆర్ఐ అధికారులు సీజ్ చేశారు.
నిందితులంతా ఆగ్నేయాసియా, కెనడాతో సన్నిహిత సంబంధాలు వున్న అంతర్జాతీయ సిండికేట్‌లో కీలక సభ్యులని డీఆర్ఐ విచారణలో తేలింది.
అయితే గోవాలో సోదాలో సమయంలో సంధూ సైపెమ్ హిల్స్ కాండోలిమ్ నుంచి తప్పించుకున్నాడు.
అనంతరం పానిపట్‌లో అతనిని అరెస్ట్ చేశారు.మార్చి 2019 వరకు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలను బొంబే హైకోర్టు తిరస్కరించింది.
అయితే జిమ్మీ ఎలాగోలా జైలు నుంచి బయటకు వచ్చి.భారత్ నుంచి పారిపోయాడు.
దుబాయ్ చేరుకుని కొత్త గుర్తింపుతో కాలం నెట్టుకొచ్చాడు.ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి 27న టూరిస్ట్ వీసాపై కెనడాలోని ఫుకెట్‌కు చేరుకున్నాడు.
తర్వాత అక్కడే ఓ విల్లాను అద్దెకు తీసుకుని నివసిస్తున్నాడు.ఈ నేపథ్యంలోనే అక్కడే దారుణ హత్యకు గురయ్యాడు.
జిమ్మీపై దుండగులు పది రౌండ్లు కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది.ఘటనాస్థలంలో ఖాళీ కాట్రిడ్జ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.