ప్రస్తుతం బెంగళూరులోని(Bangalore) ఆటో డ్రైవర్ల మోసానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఈ వీడియోలో బెంగళూరు ఆటో డ్రైవర్లు (auto drivers)ప్రయాణికులతో ఎలా ప్రవర్తిస్తున్నారో కనిపిస్తుంది.
ఈ వీడియో ప్రకారం, ఆటో డ్రైవర్లు ప్రయాణికులు మాట్లాడే భాష ఆధారంగా వారితో ప్రవర్తిస్తున్నారు.ఈ క్లిప్‌లో ఇద్దరమ్మాయిలు బెంగళూరులో ఆటో బుక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
వారిలో ఒకరు హిందీలో మాట్లాడుతుంటే, మరొకరు కన్నడలో మాట్లాడుతున్నారు.
ఒక సందర్భంలో, ఒక డ్రైవర్ హిందీ మాట్లాడే యువతకి ఆటో రైడ్ ఇవ్వడానికి నిరాకరించాడు, కానీ కన్నడలో(Kannada) అడిగినప్పుడు అదే రైడ్‌కు అంగీకరించాడు.మరొక సందర్భంలో, ఒక డ్రైవర్ హిందీ(Hindi) మాట్లాడే యువత నుంచి రూ.300 అడిగాడు, కానీ కన్నడ మాట్లాడే యువత అడిగినప్పుడు రూ.200 కి తగ్గించాడు.మూడవ సందర్భంలో, ఒక డ్రైవర్ హిందీ మాట్లాడే అమ్మాయిని పూర్తిగా విస్మరించాడు కానీ కన్నడ మాట్లాడే యువతని తీసుకెళ్లడానికి అంగీకరించాడు.
ఈ వీడియో బెంగళూరులోని ఆటో డ్రైవర్ల వైఖరిపై ప్రశ్నార్థకాలు వెలిగిస్తోంది.భాష (Language) ఆధారంగా ప్రజల పట్ల వివక్ష చూపడం సరికాదని వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
నగరంలో అన్యాయం, భాషా వివక్ష గురించి చర్చ కూడా మొదలుపెట్టారు.కొందరు డ్రైవర్లను తప్పుబట్టగా, మరికొందరు ఇంధన ధరలు పెరగడం, సరైన ఫేర్ రెగ్యులేషన్ లేకపోవడం వంటి కారణాల వల్ల డ్రైవర్లు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారని వాదిస్తున్నారు.
అంతేకాకుండా, స్థానిక భాషలు, సంస్కృతులను గౌరవించాలని చాలామంది అభిప్రాయపడుతున్నారు.భాషా తేడాల వల్ల ప్రజలను అన్యాయంగా చూడకూడదని వారు వాదిస్తున్నారు.“మనమంతా ముందుగా భారతీయులమే.కానీ ప్రతి ఒక్కరూ స్థానిక సంస్కృతులను గౌరవించాలి.
ఇక్కడ నివసిస్తున్నట్లయితే కన్నడ నేర్చుకోవాలి” అని ఒక యూజర్ కామెంట్ చేశారు.మరొకరు, “ఎందుకు ప్రజలు ఇలాంటి ప్రాంతీయ వివక్షను ప్రోత్సహిస్తున్నారు?” అని ప్రశ్నించారు.మరొక యూజర్ ముంబైతో పోల్చి చూస్తూ, “ముంబైలో ఆటో ఫేర్లు మీటర్ ఆధారంగా ఉంటాయి, భాషను బట్టి కాదు” అని అన్నారు.