టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్నేళ్లతో పోల్చి చూస్తే ప్రస్తుతం థియేటర్లలో సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతోంది.పెద్ద హీరోల సినిమాలకు, విజువల్ ఎఫెక్ట్స్ కు ప్రాధాన్యత ఉన్న సినిమాలకు మాత్రమే ప్రేక్షకులు ఓటేస్తున్నారు.
పుష్ప బెనిఫిట్ షోల టికెట్లు తెలంగాణలో మల్టీప్లెక్స్ లో( Multiplex ) 1200, సింగిల్ స్క్రీన్ లో 1000 రూపాయలుగా ఉన్నాయి.డిసెంబర్ 4వ తేదీ సెకండ్ షో నుంచి పుష్ప ది రూల్( Pushpa The Rule ) ప్రదర్శితం కానుంది.
ఓవర్సీస్ కంటే ముందే పుష్ప ది రూల్ టాక్ తెలిసిపోనుంది.మరోవైపు బెనిఫిట్ షోలకు( Benefit Shows ) సైతం అనుమతి లభించింది.ఈ టికెట్ రేట్లు( Ticket Rates ) చూస్తే హీరోల ఫ్యాన్స్ ను నిలువునా దోచేస్తున్నారా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.కల్కి, దేవర సినిమాలతో పోలిస్తే పుష్ప2 మూవీకి టికెట్ రేట్లు భారీగా పెరిగాయి.
గేమ్ ఛేంజర్( Game Changer ) సినిమాకు సైత టికెట్ రేట్ల పెంపు ఎక్కువగానే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.
డిసెంబర్ 5 నుంచి 8 వరకు మల్టీప్లెక్స్ లో 200, సింగిల్ స్క్రీన్ లో 150 పెంపు ఉండగా తర్వాత రోజుల్లో సైతం పెరిగిన టికెట్ రేట్లతోనే సినిమా ప్రదర్శితం కానుంది.పుష్ప ది రూల్ కు మరీ అద్భుతమైన టాక్ వస్తే మాత్రమే ఈ రేంజ్ టికెట్ రేట్లు వర్కౌట్ అవుతాయని చెప్పవచ్చు.పుష్ప ది రూల్ కు ఈ టికెట్ రేట్లు ప్లస్ అవుతాయో మైనస్ అవుతాయో అనే చర్చ సైతం జరుగుతోంది.
పుష్ప ది రూల్ మూవీపై అంచనాలు విపరీతంగా పెరుగుతుండగా ఏం జరుగుతుందో చూడాలి.రష్మిక పర్ఫామెన్స్, శ్రీలీల మాస్ స్టెప్పులు ఈ సినిమా స్థాయిని మరింత పెంచే అవకాశాలు అయితే ఉన్నాయి.12000కు పైగా స్క్రీన్లలో రిలీజ్ అవుతున్న సినిమాగా పుష్ప ది రూల్ చరిత్ర సృష్టిస్తోంది.