టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) నటించిన సినిమాలలో అర్జున్ సినిమా( Arjun Movie ) కూడా ఒకటి.ఈ సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.
గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ ఎమోషన్ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.సిస్టర్ సెంటిమెంట్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే.
మరి ముఖ్యంగా ఈ సినిమాలో మధుర మీనాక్షి టెంపుల్ సెట్ సినిమాకే హైలైట్ గా నిలిచిందని చెప్పాలి.చాలామంది మొదట ఈ సినిమాను మధుర మీనాక్షి టెంపుల్ లోనే షూట్ చేశారని అనుకున్నారు.
ఇకపోతే ఈ సినిమాలో తొలిప్రేమ హీరోయిన్ కీర్తి రెడ్డి( Keerthi Reddy ) మహేష్ బాబు అక్క పాత్రలో నటించిన విషయం తెలిసిందే.మహేష్, కీర్తి రెడ్డి ఇద్దరినీ గుణశేఖర్ ట్విన్స్ గా చూపించారు.సాధారణంగా తొలి ప్రేమ( Tholi Prema ) లాంటి సూపర్ హిట్ కొట్టిన హీరోయిన్ ని సిస్టర్ పాత్ర కి ఒప్పించాలంటే చాలా కష్టం.గుణశేఖర్ కి కూడా అదే పరిస్థితి ఎదురైంది.
అర్జున్ మూవీ కథ చెబుదామని డైరెక్టర్ గుణశేఖర్( Director Gunasekhar ) కీర్తి రెడ్డి దగ్గరకి వెళ్లారట.ఆయన సిస్టర్ పాత్ర అని చెప్పగానే కీర్తి రెడ్డి చిన్న చూపు చూశారట.
సిస్టర్ పాత్రలో నటించాలా ? తెలుగు సినిమాల్లో సిస్టర్ పాత్రలు ఎలా ఉంటాయో నాకు తెలుసు.
నలుగురు రౌడీలు హీరో చెల్లిని అత్యాచారం చేసి చంపేస్తారు.హీరో వాళ్లపై రివేంజ్ తీర్చుకుంటాడు, ఇంతే కదా స్టోరు నేను ఇంట్రెస్ట్ లేదు చేయను అని చెప్పేసిందట.దీనితో గుణశేఖర్ ముందు కథ వినమ్మా తల్లీ అని బతిమాలుకున్నారట.
గుణశేఖర్ కథ చెప్పాక ఇలాంటి క్యారెక్టర్ నేను అసలు ఊహించలేదు.రొటీన్ సిస్టర్ స్టోరీ అనుకున్నా క్షమించండి.
ఈ సినిమా నేను అస్సలు వదులుకోను అని ఒకే చెప్పిందట.కీర్తి రెడ్డిని చూడగానే గుణశేఖర్ కథలో కీలక మార్పు కూడా చేశారట.
అప్పటి వరకు అర్జున్ సినిమా కథలో బ్రదర్ సిస్టర్ అని అనుకున్నారు.కీర్తి రెడ్డిని చూశాక ట్విన్స్ స్టోరీగా మార్చారట.
ఎందుకంటే మహేష్, కీర్తి రెడ్డి చూడడానికి ఒకేలా ఉన్నారు అని గుణశేఖర్ తెలిపారు.