సిక్కు ఎన్జీవో సంస్ధ పెద్ద మనసు .. అమెరికా వ్యాప్తంగా ఏకంగా 10 వేల మందికి భోజనం

ప్రపంచంలోని ఏ మూల ఉన్నా సిక్కులు( Sikhs ) తమ ఆచార వ్యవహారాలను కాపాడుకోవడంతో పాటు సాంప్రదాయాలను తూచా తప్పకుండా పాటిస్తారు.ఇక సాటి వాడికి సాయం చేయాలనే తమ మత విశ్వాసాలను సైతం నిక్కచ్చిగా అమలు చేస్తారు.

 Sikh Body Serves Langar To Thousands Across Us Details, Sikh ,serves Langar , Us-TeluguStop.com

తాజాగా అమెరికాలోని న్యూజెర్సీకి( New Jersey ) చెందిన ఓ సిక్కు ఎన్జీవో సంస్థ ‘Let’s Share a Meal’ లంగర్ ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా వేలాది మందికి ఉచితంగా భోజనాన్ని అందజేసింది.

అమెరికాలోని న్యూజెర్సీ, న్యూయార్క్, పెన్సిల్వేనియా, మసాచుసెట్స్, కనెక్టికట్‌లోని 80 ప్రదేశాలలో 10 వేల మందికి పైగా వ్యక్తులకు లెట్స్ షేర్ ఏ మీల్ అంటూ భోజనాన్ని అందించారు.

దాదాపు 700 మందికి పైగా వాలంటీర్లు భోజన ఏర్పాట్లు, సరఫరాలో పాల్గొని అందరికీ కడుపు నింపారు.ఈ కార్యక్రమంపై నిర్వాహకులలో ఒకరైన ఓంకర్ సింగ్ మాట్లాడుతూ.సిక్కు మత వ్యవస్ధాపకుడు గురునానక్( Gurunanak ) బోధించిన విధంగా లంగర్( Langar ) లేదా కమ్యూనిటీ కిచెన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.తమ సంస్థ ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు అమెరికా వ్యాప్తంగా 1 మిలియన్‌ మందికి పైగా భోజనం అందించినట్లు ఓంకర్ చెప్పారు.

Telugu Meals, Gurunanak, Harleen Kaur, Langar, Lets Share Meal, Jersey, Jersey S

మరో వాలంటీర్ హర్లీన్ కౌర్ మాట్లాడుతూ.తాను 15 ఏళ్లుగా ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు చెప్పారు.ప్రతి ఏటా వాలంటీర్లు, దాతలు పెరుగుతున్నారని.ఇప్పుడు ఈ సంస్థ ఏడాదికి 20 వేలకు పైగా భోజనాలను పంపిణీ చేస్తుందని ఆమె తెలిపారు.శాంతి, సామరస్యం, ఏకత్వంతో కూడిన సిక్కు మత విలువలను తమ పిల్లలకు నేర్పడానికి తాము ప్రయత్నిస్తున్నామని ఏకత్వం అంటే సిక్కులకే కాదు, మానవాళి అందరికీ అని హర్లీన్ పేర్కొన్నారు.

Telugu Meals, Gurunanak, Harleen Kaur, Langar, Lets Share Meal, Jersey, Jersey S

కాగా.15వ శతాబ్ధంలో అవిభక్త భారత్‌లోని పంజాబ్‌లో సిక్కు మతం పుట్టింది.నేడు ప్రపంచవ్యాప్తంగా 25 మిలియన్లకు పైగా ప్రజలు ఈ మతాన్ని అనుసరిస్తున్నారు.అధికారిక గణాంకాల ప్రకారం.5,00,000 మంది సిక్కులు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో నివసిస్తున్నారని అంచనా.అగ్రరాజ్యం తర్వాత ఆస్ట్రేలియా, కెనడా, యూకేలలో పెద్ద సంఖ్యలో సిక్కులు స్థిరపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube