టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున( Akkineni Nagarjuna ) ప్రస్తుతం సినిమాలలో నటిస్తూ బిజీ గా ఉన్న విషయం తెలిసిందే.తెలుగుతో పాటు హిందీ సినిమాల్లో కూడా నటిస్తున్నారు.
చాలా కాలంగా నాగార్జున సరైన హిట్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.అయితే నాగ్ ఖాతాలో సరైన హిట్ సినిమా పడి చాలా రోజులు అయ్యింది.
ఆ సంగతి పక్కన పెడితే తాజాగా నాగార్జున సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ ఒకటి చేశారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆ పోస్ట్ లో తన కుటుంబానికి ఎంతో ముఖ్యమైన వ్యక్తి మరణించారంటూ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసారు.
అక్కినేని నాగేశ్వర రావు( Akkineni Nageswara Rao ) వారసత్వంగా ఆయన అభిమానులు ఎందరో ఇప్పటికీ నాగ్ కుటుంబాన్ని ఆధరిస్తారు.తన తండ్రిని అభిమానులను ఎంతో ప్రత్యేకంగా నాగార్జున చూస్తారని తెలిసిందే.అయితే ప్రస్తుతం తన తండ్రి అభిమాని మరణ వార్తను తెలుసుకున్న నాగ్ చాలా ఎమోషనల్ అయ్యారు.
ఈ మేరకు తాజాగా సంతాపం తెలిపారు.మా కుటుంబానికి ఎంతో ముఖ్యమైన వ్యక్తి యద్దుల అయ్యప్ప రెడ్డి ( Yaddula Ayyappa Reddy )మరణించడం నన్ను బాగా కలచివేసింది.
ఆయన మా నాన్న గారికి వీరాభిమాని.నాన్న నుంచే మాకు మరింత దగ్గరయ్యారు.
అక్కినేని కుటుంబానికి మూల స్తంభంగా ఇన్నాళ్ల పాటు ఉన్నారు.
మా ఫ్యామిలీ మీద ఆయన చూపిన ప్రేమ, అభిమానం ఎప్పటికీ మరిచిపోలేను.ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి ఈ కష్ట సమయం నుంచి వారు త్వరగా కోలుకునే శక్తిని దేవుడు అందిస్తాడు అని కోరుకుంటున్నాను అని నాగార్జున తన ట్వీట్ లో పేర్కొన్నారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ గా మారింది.
ఇకపోతే యద్దుల అయ్యప్పరెడ్డి విషయానికి వస్తే.కర్నూలుకు చెందిన వ్యక్తి.
నాగేశ్వర రావు అభిమానిగా చాలా ఏళ్ల నుంచి అక్కినేని ఫ్యామిలీకి దగ్గరగా ఉంటున్నారు.నాగార్జున కుటుంబానికి సంబంధించిన అన్ని పనుల్లో ఆయన అండగా ఉండేవారు సమాచారం.
వారి కుటుంబంలో జరిగే ప్రతి శుభకార్యంలో కూడా అయ్యప్ప రెడ్డి ఉండే వారు.అక్కినేని హీరోల ప్రతి సినిమా విడుదల సమయంలో ఆయన సందడిగా కనిపించేవారని అభిమానులు చెబుతుంటారు.