శివయ్య భక్తిలో టాలీవుడ్ హీరోయిన్లు.. శివుడి నామాలతో కనిపించిన హీరోయిన్లు వీళ్లే!

తాజాగా మహాశివరాత్రి పండుగ ( Mahashivratri festival )సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.మాఘమాసం ఆఖరి రోజు అందులో మహాశివరాత్రి కావడంతో భక్తులు శివాలయాలకు అధిక సంఖ్యలో పోటెత్తారు.

 Nidhi Agarwal And Ananya Maha Shivratri 2025 Special, Nidhi Agarwal, Ananya Naga-TeluguStop.com

శివాలయాలు అన్నీ కూడా శివనామస్మరణతో మారుమోగిపోయాయి.అయితే ఈ మహాశివరాత్రి వేడుకలను సామాన్యుల నుంచి సెలబ్రిటీల( Celebrities ) వరకు ప్రతి ఒక్కరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు.

అందులో భాగంగానే టాలీవుడ్ సెలబ్రిటీలు చాలామంది మహాశివరాత్రి వేడుకలను జరుపుకొని అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ప్రస్తుతం ఆ ఫోటోస్ అందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇంతకీ ఆ హీరోయిన్లు ఎవరు ఏంటి అన్న వివరాల్లోకి వెళితే.మహాశివరాత్రి పండుగ సందర్భంగా నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల ( Nidhi Aggarwal, Ananya Nagalla )లాంటి హీరోయిన్స్ దేవాలయాలకు వెళ్లారు.

సింగర్ శ్రేయా ఘోషల్( Singer Shreya Ghoshal ) శివుడి బొమ్మతో ఉన్న చీరతో కనిపించింది.మరికొందరు బ్యూటీస్ ఎప్పటిలానే కాస్త గ్లామరస్ పోస్టులు పెట్టారు.

హీరోయిన్ శ్రేయ ఘోషల్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా శివయ్య ఉన్న బట్టలను ధరించిన ఈ ముద్దుగుమ్మ చేతులకు విభూదితో మూడు నామాలను గీసుకొని, అందంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.అలాగే అనన్య నాగళ్ళ పద్ధతిగా చీర కట్టుకొని అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

అనన్య మహాశివరాత్రి పండుగ సందర్భంగా శ్రీశైలంలో దర్శించింది.అలాగే ప్రేమ కావాలి హీరోయిన్ ఇషా చావ్లా ( Isha Chawla )తాజాగా పద్ధతిగా చీర కట్టుకొని నిండుగా అలంకరించుకొని మరి మహాశివరాత్రి వేడుకలను జరుపుకుంది.చాలా చక్కగా పట్టు చీరలో ఒంటి నిండా నగలతో మెరిసిపోతోంది ఇషా చావ్లా.అలాగే సుస్మితాసేన్ ( Susmithasen )కూడా మహాశివరాత్రి పండుగ సందర్భంగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది.

వీటితోపాటు ఇంకా చాలామంది హీరోయిన్లు కూడా ఫోటోలు షేర్ చేశారు.ప్రణీత పట్టు లంగా వోణీలో మెరిసింది.చక్కగా అందంగా అలంకరించుకొని పద్ధతిగా కనిపిస్తూనే అందాలతో సెగలు పుట్టిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube