సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటి సమంత ( Samantha ) ఒకరు.ఏం మాయ చేసావే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈమె అనంతరం వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు.
ఇలా ఈమె కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే నటుడు నాగచైతన్యతో ( Nagachaitanya ) ప్రేమలో పడ్డారు.ఇలా ప్రేమలో ఉన్న వీరిద్దరూ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు.
అయితే వీరి వైవాహిక జీవితం ఎక్కువ కాలం నిలబడలేదని చెప్పాలి.

వ్యక్తిగత భేదాభిప్రాయాలు కారణంగా వీరిద్దరు కూడా విడాకులు( Divorce ) తీసుకొని విడిపోయారు అయితే విడాకుల తర్వాత కూడా సమంత తన సినిమాల కంటే ఎక్కువగా తన వ్యక్తిగత విషయాల ద్వారానే వార్తల్లో నిలిచారు.ఈమె సోషల్ మీడియా వేదికగా ఎలాంటి కామెంట్స్ చేసినా లేదా ఏదైనా పోస్ట్ చేసిన అది తప్పనిసరిగా నాగచైతన్యను ఉద్దేశించి చేసింది అంటూ అభిమానులు ఈమె గురించి చర్చలు జరుపుతూ ఉంటారు.అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా సమంత తన ఫస్ట్ లవ్ ( First Love )అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇలా సమంత తన ఫస్ట్ లవ్ గురించి మాట్లాడటంతో కచ్చితంగా నాగచైతన్య గురించి మాట్లాడి ఉంటుందని అందరు భావిస్తున్నారు కానీ ఆమెకు ఫస్ట్ లవ్ నాగచైతన్య కాదని సినిమాలే తన ఫస్ట్ లవ్ అంటూ చెప్పకు వచ్చారు.ఇప్పటి నుండి నేను సినిమాలకు గ్యాప్ ఇవ్వాలి అనుకోవడం లేదు.మళ్లీ సినిమాల్లో వరుసగా నటిస్తాను.ఇప్పటికే చాలా రోజులు గ్యాప్ ఇచ్చాను.ఇకపై వెయిట్ చేయించలేను అంటూ సినిమాలపై తనకు ఉన్నటువంటి ప్రేమను బయటపెట్టారు.ఇక సమంత చివరిగా ఖుషి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.







