నేటి టెక్నాలజీ కాలంలో పిల్లలతో టైమ్ స్పెండ్ చేసే తల్లిదండ్రులే కరువయ్యారు.స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ వంటి గాడ్జెట్స్‌తోనే సమయం మొత్తాన్ని గడుపుతూ పిల్లలను పట్టించుకోవడమే మానేస్తున్నారు.
అయితే పిల్లల శరీరక మరియు మానసిక ఎదుగుదల బాగుండాలంటే పోషకాహారం ఇస్తే సరిపోదు.వాళ్లతో తల్లిదండ్రులు రోజు కొంత సమయాన్ని కూడా గడపాలి.
ముఖ్యంగా పిల్లల విషయంలో కౌగిలింత అద్భుతంగా పని చేస్తుంది.ప్రతి రోజు తల్లిదండ్రులు పిల్లలను ప్రేమగా మనసుకు హత్తుకుంటే ఎన్నో అద్భుతాలు చోటు చేసుకుంటాయి.
సాధారణంగా పిల్లలు బాగా అల్లరి చేస్తున్నప్పుడు.విసుక్కుంటూ వాళ్లను కొట్టేస్తుంటారు.కానీ, ఇకపై అలా చేయకండి.కొడితే పిల్లలు అస్సలు మాట వినరు.
అల్లరి చేస్తున్నప్పుడు లేదా ఇంకేదైనా తప్పు చేస్తున్నప్పుడు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు పిల్లలను ప్రేమగా కౌగిలించుకుని సున్నితంగా చెబితే ఖచ్చితంగా మాట వింటారు.
అలాగే పిల్లలను రోజు తల్లిదండ్రులు మనసారా కౌగిలించుకోవడం వల్ల.
వారిలో ఆక్సిటోసిన్, డోపమైన్, సెరోటోనిన్ అనే హార్మోన్లు విడుదల అవుతాయి.ఇవి పిల్లల్లో ఒత్తిడి, చికాకు వంటి వాటిని తొలగించి మెదడు పని తీరును చురుగ్గా మారుస్తాయి.
దాంతో పిల్లలు చదువుల్లో, ఆటల్లో బాగా రాణిస్తారు.మంచి నడవడికను అలవరుచు కుంటారు.
పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెంచేందుకు తల్లిదండ్రులు తెగ ప్రయత్నిస్తుంటారు.అయితే కౌగిలింతతోనూ అది సాధ్యం అవుతుంది.అవును, పిల్లలను రోజు కాసేపు ప్రేమగా కౌగిలించుకోవడం వల్ల వారి ఇమ్యూనిటీ అద్భుతంగా బూస్ట్ అవుతుంది.
అంతేకాదు, పిల్లలను రోజు తల్లి దండ్రులు హత్తుకుంటే తమకు ఏ కష్టం వచ్చినా వెన్ను తట్టే వారు ఉన్నారనే నమ్మకం వారికి ఏర్పడుతుంది.ఏ పనిలో అయినా ధైర్యంగా ముందుకు వెళ్తారు.మరియు భయాలను, భావోద్వేగాలను నియంత్రించుకునే శక్తి వారికి లభిస్తుంది.