టాలీవుడ్ హీరో మంచు విష్ణు( Hero Manchu Vishnu ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
ఏప్రిల్ నెల 25వ తేదీన ఈ సినిమా విడుదల కానుండగా ఈ సినిమా బాక్సాఫీస్ ( box office )ను షేక్ చేసే మూవీ అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
మంచు విష్ణు తాజాగా కన్నప్ప మూవీ( Kannappa movie ) గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
హిందీ టీజర్ లాంఛ్ ఈవెంట్ ( Hindi teaser launch event )లో విష్ణు మాట్లాడుతూ నేను మోహన్ బాబు కుమారుడినని చెప్పడానికి గర్వపడతానని అన్నారు.ఆయన లేకపోతే నేను నటుడిని అయ్యేవాడిని కాదని విష్ణు చెప్పుకొచ్చారు.
నాన్న కారణంగానే అక్షయ్ కుమార్ కూడా ఈ సినిమాలో నటించారని షూటింగ్ సమయంలో అక్షయ్ కుమార్ నుంచి ఎన్నో కొత్త విషయాలను నేర్చుకున్నానని విష్ణు తెలిపారు.

ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు నూటికి నూరు శాతం న్యాయం చేశారని విష్ణు కామెంట్లు చేశారు.ఈ సినిమా షూట్ సమయంలో నాలో ఎన్నో మార్పులు వచ్చాయని ఉన్నతంగా ఆలోచిస్తున్నానని విష్ణు తెలిపారు.ఈ సినిమా కోసం మోహన్ లాల్, ప్రభాస్ ( Mohanlal, Prabhas )అందరూ కష్టపడ్డారని మంచు విష్ణు పేర్కొన్నారు.
ఈ తరంలో శివుడు అంటే మొదట అక్షయ్ కుమార్ పేరు గుర్తుకు వస్తుందని విష్ణు తెలిపారు.

కన్నప్ప సినిమాను రెండుసార్లు రిజెక్ట్ చేశానని అక్షయ్ కుమార్ అన్నారు.విష్ణు, మోహన్ బాబు ఎన్నోసార్లు ఫోన్ చేశారని బిజీగా ఉండటం వల్ల తాను మాట్లాడలేకపోయానని అక్షయ్ కుమార్ తెలిపారు.విష్ణు మాటల్లో నిజాయితీ కనిపించిందని వీళ్లిద్దరూ వచ్చి కలిసి మాట్లాడిన వెంటనే అంగీకరించానని అక్షయ్ కుమార్ పేర్కొన్నారు.
కన్నప్ప సినిమాతో విష్ణు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది.