భార్యాభర్తల మధ్య చిన్న గొడవలు రావడం చాలా సహజం.అయితే, వాటిని పరిష్కరించుకునే విధానం ప్రతి ఒక్కరి దృష్టిలో భిన్నంగా ఉంటుంది.
కొన్ని కుటుంబాల్లో చిన్న చిన్న సమస్యలను ప్రేమతో పరిష్కరించుకుంటే, మరికొందరు వాటిని పెద్దవిగా మార్చుకుంటారు.అలాంటి సంఘటనే తాజాగా రష్యా( Russia ) రాజధాని మాస్కోలో చోటుచేసుకుంది.
భార్య కోపాన్ని శాంతపరిచేందుకు భర్త ఏకంగా 27 లక్షల విలువైన లగ్జరీ కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు.కానీ భార్యకు అది నచ్చకపోవడంతో కోపంతో భర్త కారును చెత్తకుప్పలో పడేశాడు.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
భార్య భర్తల మధ్య సఖ్యత కుదరకపోవడంతో భర్త పెద్ద ప్లాన్ వేసుకున్నాడు.
ఆమెను సంతోషపెట్టడానికి ఒక అద్భుతమైన బహుమతి ఇవ్వాలని భావించాడు.తన భార్యకు లగ్జరీ కార్లు( Luxury cars ) అంటే ఇష్టమని తెలుసుకున్న అతను ఏకంగా రూ.27 లక్షల విలువైన ఎస్‌యూవీ కారును( SUV car ) కొనుగోలు చేశాడు.వాలెంటైన్స్ డే రోజున గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేశాడు.
అయితే, కారును టెస్ట్ డ్రైవ్ చేస్తున్న సమయంలో చిన్న ప్రమాదం జరిగింది.ఇంకేముంది.
కారుకు స్వల్పంగా డ్యామేజ్ అయింది.అయితే, పెద్దగా సమస్యగా అనుకోకపోవడంతో బాగు చేయించకుండా గిఫ్ట్‌గా అందజేయాలని నిర్ణయించుకున్నాడు.
భార్యను బయటకు పిలిచి సర్‌ప్రైజ్‌గా కారును చూపించాడు.తొలుత చాలా ఆనందపడిన భార్య కారును పూర్తిగా పరిశీలించింది.
కారుపై చిన్న డ్యామేజ్ కనిపించడంతో వెంటనే మొహం మూసుకుని నాకు ఈ కారు వద్దని తిరిగి వెళ్లిపోయింది.

భార్య ఇలా నిరాకరించడంతో భర్త తీవ్ర అసహనానికి గురయ్యాడు.ఎంతో ప్రేమతో, పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసి కొనుగోలు చేసిన కారును ఆమె నిరాకరించడంతో క్షణికావేశంలో ఘోరమైన నిర్ణయం తీసుకున్నాడు.కారును తీసుకెళ్లి నేరుగా చెత్తకుప్పలో పడేశాడు.
స్థానికులు చెత్తకుప్పలో లగ్జరీ కారును చూసి షాక్ అయ్యారు.అసలు ఏమైందో తెలుసుకోవడానికి ఆసక్తి చూపించారు.
అలా రెండు వారాల పాటు ఆ కారు చెత్తకుప్పలోనే ఉంది.నెట్టింట్లో ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవ్వడంతో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.

మొత్తం మీద భార్యాభర్తల మధ్య సంబంధాలు ప్రేమ, ఓర్పు, పరస్పర అంగీకారంతోనే బలంగా నిలుస్తాయి.చిన్న చిన్న గొడవలను పెద్దవి చేసుకోవడం సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది.మాస్కోలో జరిగిన ఈ సంఘటన ఇందుకు ఓ ప్రత్యక్ష ఉదాహరణ.కేవలం చిన్న డ్యామేజ్ కోసం కారును నిరాకరించడమా? లేక భర్త ఆ కోపాన్ని తట్టుకోలేక కారును చెత్తకుప్పలో పడేయడమా? అసలు నిజమైన సమస్య ఏదీ? ఈ ప్రశ్నలు నెటిజన్లను ఆలోచనలో పడేస్తున్నాయి.







