వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్లిన ప్రవాస భారతీయులు మాతృభూమికి ఏ కష్టమొచ్చినా ముందుంటున్నారు.కరోనా సమయంలో పెద్ద ఎత్తున పీపీఈ కిట్లు, మందులు, ఇతర అత్యవసర వస్తువులను భారతదేశానికి పంపించారు.
దేశానికి పెద్ద ఎత్తున విదేశీ మారకద్రవ్యం పంపడంతో పాటు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలలో ఎన్ఆర్ఐలు పాల్గొంటున్నారు.విద్య, వైద్యం, పేదరిక నిర్మూలన, గ్రామీణాభివృద్ధి వంటి అంశాలలో ఎన్ఆర్ఐలు( NRIs ) పలు కార్యక్రమాలను చేపట్టారు.
మనదేశంలో కంపెనీలు, పరిశ్రమలు స్థాపించి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు.

తాజాగా హైదరాబాద్‌లోని ప్రముఖ క్యాన్సర్ హాస్పిటల్స్‌లో ఒకటైన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు( Basavatharakam to the Indo American Cancer Hospital and Research Institute ) అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయ దంపతులు డాక్టర్ రాఘవేంద్రరావు- కళ్యాణిలు రూ.10 కోట్లు విరాళం ఇచ్చి తమ పెద్ద మనసు చాటుకున్నారు.బసవతారకం ఆసుపత్రికి అనుబంధంగా ఇండో అమెరికన్ క్యాన్సర్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఐఏసీఆర్ఓ) ఏర్పాటుకు వారు ఈ విరాళం అందజేశారు.
శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం డాక్టర్ రాఘవేంద్రరావు- కళ్యాణిలు ( Dr.Raghavendra Rao- Kalyanilu )బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్ , సినీనటుడు నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) సమయంలో ఆసుపత్రి మేనేజ్‌మెంట్‌కు మొదటి విడతగా రూ.5 కోట్ల చెక్ అందజేశారు.

నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు సబ్సిడీ ధరలకు అత్యాధునిక క్యాన్సర్ చికిత్స సౌకర్యాలను అందించడంతో పాటు బసవతారకం ఆసుపత్రి ఇటీవల అధునాతన క్యాన్సర్ పరిశోధనపై దృష్టి సారించింది.దీనిలో భాగంగా శాస్త్రవేత్తలు, పరిశోధకులు క్యాన్సర్‌పై అధునాతన పరిశోధనలను చేపట్టడానికి వీలుగా ఐఏసీఆర్‌వో అనే అత్యాధునిక పరిశోధనా సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని ఆసుపత్రి నిర్ణయించింది.ఈ సందర్భంగా డాక్టర్ రాఘవేంద్రరావు మాట్లాడుతూ.
బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలోని కొత్త క్యాన్సర్ పరిశోధనా కేంద్రం దేశంలోని లక్షలాది మంది క్యాన్సర్ రోగులకు కొత్త ఆశను తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.