తాజాగా ఇండియన్ మెంటలిస్ట్ సుహానీ షా( Suhani Shah ) ఆస్ట్రేలియన్ టీవీ హోస్ట్ లను( Australian TV Hosts ) షాక్ కి గురిచేసింది.మైండ్ రీడింగ్( Mind Reading ) స్కిల్స్ తో వాళ్లని నివ్వెరపోయేలా చేసింది.
రీసెంట్ గా ఒక ఆస్ట్రేలియన్ టీవీ షోలో సుహాని షా చేసిన మ్యాజిక్ చూసి అందరూ అవాక్కయ్యారు.ఆమె టాలెంట్ ముందు హోస్ట్ లకి మాటలు కూడా రాలేదంటే నమ్మండి.
లైవ్ షో జరుగుతుండగా, ఒక హోస్ట్ సీక్రెట్ క్రష్( Secret Crush ) పేరుని కరెక్ట్ గా గెస్ చేసింది సుహాని.అంతేకాదు, ఇంకో హోస్ట్ ఐఫోన్ పాస్‌కోడ్ చెప్పేసి అందరి ముందే ఫోన్ అన్‌లాక్ చేసింది.
ఆ దెబ్బకి స్టూడియో మొత్తం సైలెంట్ అయిపోయింది.మామూలు మ్యాజిషియన్స్‌లాగా సుహాని ఏ ప్రాప్స్, గిమ్మిక్స్ యూజ్ చేయదు.
మనుషుల సైకాలజీ, బిహేవియర్ పై ఆమెకున్న పట్టుతోనే మ్యాజిక్ చేస్తుంది.హోస్ట్‌లు లైవ్ టీవీలో ఆమె టాలెంట్ ని టెస్ట్ చేస్తే, సుహాని మాత్రం సూపర్ సక్సెస్ కొట్టింది.

వీడియో వైరల్ అవ్వడంతో, సోషల్ మీడియాలో సుహాని టాలెంట్ కి ఫిదా అయిపోయారు నెటిజన్లు.చాలామంది ఆమె టాలెంట్ చూసి ఇంప్రెస్ అవ్వగా, ఇంకొంతమంది మాత్రం ఈ ట్రిక్స్ ఎలా చేస్తుందో అని క్యూరియాసిటీతో కామెంట్స్ చేస్తున్నారు.

ఒక యూజర్ అయితే, “సుహాని టాలెంట్ కి ఇప్పుడైనా సరైన గుర్తింపు దక్కింది” అని కామెంట్ చేశారు.ఇంకొకరేమో, “ఫారెన్ నేమ్ గెస్ చేయడం ఇండియన్స్ కి చాలా కష్టం.నేను 10 ఇయర్స్ అమెరికాలో ఉన్నా, ఆ లాస్ట్ నేమ్ ఎప్పుడూ వినలేదు.ఆ హోస్ట్ ఆస్ట్రేలియన్ యాక్సెంట్ లో చెప్పడం వల్ల స్పెల్లింగ్ గెస్ చేయడం ఇంకా కష్టం” అని కామెంట్ పెట్టారు.
ఇంకొందరైతే సింపుల్ గా “సుహాని రాక్స్”, “ఇది నిజంగా అమేజింగ్” అంటూ పొగిడేశారు.
సుహానీ షా లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ప్రకారం, ఇప్పటివరకు 5,000కు పైగా షోలు చేసిందట.తను జస్ట్ మెంటలిస్ట్ మాత్రమే కాదు, ఒక రైటర్ కూడా.“అన్‌లీష్ యువర్ ఇన్నర్ పవర్” అనే బుక్ కూడా రాసింది.తన స్పెషల్ టాలెంట్, సైకాలజీపై ఉన్న నాలెడ్జ్ తో మైండ్ రీడింగ్, మెంటలిజం వరల్డ్ లో సుహాని ఒక సపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంది.







