ఎస్వీఆర్ కి తిన‌డానికి తిండిలేని పరిస్థితిలో అంజ‌లీదేవి ఏం చేసింది ?

తెలుగు సినిమా పరిశ్రమలో తిరుగులేని ఆర్టిస్టు ఎస్వీ రంగారావు.తన అద్భుత నటనతో హీరోలను తలదన్నే పాత్రలు చేశాడు ఆయన.సినిమా రంగంలో అద్భుత నటుడిగా గుర్తింపు పొందిన తనకూ కెరీర్ తొలినాళ్లు తీవ్ర అవస్థలు తప్పలేదు.సినిమాల్లోకి రావాలని మద్రాసుకు వెళ్లాడు రంగారావు.

 How Anjali Devi Helped Actor Svr, Svr , Anjali , Tollywood , Anjali Devi Helped-TeluguStop.com

అక్కడ ఓ ప్రెస్ లో నేల మీద పేపర్లు వేసుకుని పడుకునేవాడు.తినడానికి తిండి లేక నానా అవస్థలు పడేవాడు.

మంచి నీళ్లు తాగి పడుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి.ఒకనాకొక సమయంలో సినిమాలు చేయడం కంటే ఇంటికి వెళ్లిపోవడమే మంచిది అనుకున్నాడు.

కానీ కొందరు మిత్రులు తనను వారించారు.

వారి మాటల ప్రకారమే.

ఎస్వీఆర్ మద్రాసులో ఉండిపోయాడు.అంతకు ముందే సినిమాల్లో రాణిస్తున్న అంజలీ దేవితో ఎస్వీఆర్ కు పరిచయం ఉంది.

వీరిద్దరు కాకినాడలో ఉండగా కలిసి నాటకాలు వేసేవారు.మద్రాసులో ఎస్వీఆర్ పరిస్థితి గురించి తెలుసుకున్న అంజలీదేవి.

Telugu Svr, Anjali, Anjali Devi, Pathala Bhiravi, Svr Carrier, Tollywood-Telugu

తన ఇంట్లోని అయ్యర్ కు ఓ మాట చెప్పింది. ఎస్వీఆర్ ఎప్పుడు ఇంటికి వచ్చినా.లేదనకుండా భోజనం పెట్టాలని సూచించింది.అలా వారి ఆకలి తీర్చింది అంజలీ దేవి.ఆ తర్వాత ఎస్వీఆర్ కు హీరోగా అవకాశం వచ్చింది.1946లో వరూధిని అనే సినిమా చేశాడు.కానీ ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.మళ్లీ తనకు సినిమా కష్టాలు మొదలయ్యాయి.

Telugu Svr, Anjali, Anjali Devi, Pathala Bhiravi, Svr Carrier, Tollywood-Telugu

అదే సమయంలో ఇంటికి వెళ్లిపోవాలి అనుకున్నాడు.అప్పుడే తన కుటుంబ సభ్యులు ఆయన మేన కోడలితో పెళ్లి చేశారు.సంసార భారం మీద పడటంతో జెంషెడ్ పూర్ వెళ్లి ఉద్యోగం చేయడం మొదలు పెట్టాడు.అక్కడ తను ఉద్యోగం చేస్తుండగానే దర్శకుడు సుబ్బారావు ఓ కబురు పంపాడు.ఆ తర్వాత ఆయన నాలుగైదు సినిమాలు చేశాడు.1951లో వ‌చ్చిన పాతాళ‌భైర‌వి సినిమా తన స్థితి పూర్తిగా మార్చివేసింది.ఆ సినిమా తర్వాత ఎస్వీఆర్ వెనక్కి తిరిగి చూసుకోలేదు.తను చనిపోయేంత వరకు అగ్ర నటుడిగానే కొనసాగాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube