సినీ నటుడు పోసాని కృష్ణమురళి( Posani Krishna Murali ) అరెస్ట్ అయిన విషయం మనకు తెలిసిందే.ఈయన గతంలో వైఎస్ఆర్సిపీ పార్టీలో కీలకపాత్ర పోషించారు అయితే ఈయన వైసీపీలో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ ,చంద్రబాబు, లోకేష్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ప్రస్తుతం కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు నేతలపై కేసులు పెడుతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే పోసాని కృష్ణ మురళిని సైతం పోలీసులు అరెస్టు ( Arrest )చేశారు.ఇలా ఈయన అరెస్టు కావడంతో మరోసారి ఇండస్ట్రీలోనూ అలాగే ఏపీ రాజకీయాలలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

ఇదిలా ఉండగా పోసాని అరెస్టు కావడంతో మరో నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రాజ్ ( Pruthvi Raj ) సోషల్ మీడియా వేదికగా పోసాని అరెస్టు గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.ఈ సందర్భంగా ఈయన X వేదికగా స్పందిస్తూ… నోటి దూలకు తగిన శాస్తి తప్పదు.నిజం ఎప్పుడూ న్యాయానికి తోడుగా నిలుస్తుంది.మాట చాలా విలువైనది.అందుకే ఎప్పుడూ పొదుపుగా వాడాలి.నిజం తెలుసుకొని ఎప్పుడు ఆగిపోవాలో తెలిసిన వాడే మహాపురుషుడు అంటూ పృథ్వీ చేసిన ఈ ట్వీట్ సంచలనగా మారింది.

ఇక ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఎంతోమంది ఈయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.మాటలు పొదుపుగా వాడాలి అనే విషయాలు నువ్వు చెప్తేనే అందరూ నేర్చుకోవాలి అంటూ కొందరు ఈయన మాటలను విమర్శించగా మరికొందరు ఈయనకు మద్దతుగా పోస్టులు కూడా చేస్తున్నారు.ఇటీవల వైసీపీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పృథ్వీ వివాదంలో నిలిచిన సంగతి తెలిసిందే.ఈయన వ్యాఖ్యల కారణంగా లైలా సినిమా కూడా ఇబ్బందులలో చిక్కుకొని భారీ నష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది.
ఈ విషయాన్ని గుర్తు చేస్తూ కొందరు ఈయనపై విమర్శలు కురిపిస్తున్నారు.