కోలీవుడ్ ఇండస్ట్రీలో( Kollywood Industry ) తన టాలెంట్ తో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలలో సూర్య( Surya ) ఒకరు.సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా సూర్య కెరీర్ ను కొనసాగిస్తుండగా కంగువా సినిమాతో సూర్యకు ఆశించిన ఫలితం దక్కలేదనే సంగతి తెలిసిందే.
అయితే కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రదీప్ రంగనాథన్( Pradeep Ranganathan ) నటించి నటించి విడుదలైన డ్రాగన్ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఈ సినిమా కలెక్షన్ల విషయంలో సైతం అదరగొడుతున్న సంగతి తెలిసిందే.
జ్యోతిక( Jyotika ) ప్రస్తుతం డబ్బా కార్టెల్( Dabba Cartel ) అనే వెబ్ సిరీస్ తో బిజీగా ఉండగా ఆ సిరీస్ ప్రచారంలో భాగంగా జ్యోతిక తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షే చేయడంతో పాటు కీలక వ్యాఖ్యలు చేశారు.డ్రాగన్ సినిమా సూర్య సినిమా కలెక్షన్ల కంటే ఎక్కువ సాధిస్తోందనే కామెంట్ కు జ్యోతిక రియాక్ట్ కాలేదు.

అయితే సూర్య కంటే కోలీవుడ్ హీరో విజయ్ ( Vijay )బెటర్ అంటూ చేసిన కామెంట్ గురించి ఆమె స్పందిస్తూ ఆ కామెంట్ హాస్యాస్పదంగా ఉందని చెప్పుకొచ్చారు.జ్యోతిక ఈ విధంగా రియాక్ట్ కావడం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు జ్యోతిక నటించిన డబ్బా కార్టెల్ ఈ నెల 28వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.హిటేశ్ భాటియా ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించారు.

ఈ వెబ్ సిరీస్ ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.సూర్య భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై అంచనాలు పెరుగుతుండగా ఆ ప్రాజెక్ట్ లతో సూర్య భారీ విజయాలను అందుకుంటారేమో చూడాలి.సూర్య కెరీర్ ప్లాన్ ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.సూర్య పారితోషికం ఒకింత భారీ స్థాయిలో ఉంది.సూర్య కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.