2025 సంవత్సరంలో ప్రతి సంవత్సరంలా ఎక్కువ సంఖ్యలో సినిమాలు విడుదలయ్యాయి.జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఏకంగా 20కు పైగా సినిమాలు రిలీజయ్యాయి.
అయితే ఈ సినిమాలలో హిట్టైన సినిమాలు ఎన్ని అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం వినిపిస్తోంది.కేవలం రెండే రెండు సినిమాలు అందరికీ లాభాలను అందించిన సినిమాలు అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఈ సినిమాలలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా( Sankrantiki vastunnam ) మొదటి సినిమా కాగా తండేల్ సినిమా ( Tandel movie )రెండో సినిమా కావడం గమనార్హం.మామా అల్లుళ్లు బాక్సాఫీస్ వద్ద తమ సినిమాలతో అదరగొట్టారని చెప్పడంలో సందేహం అవసరం లేదు.
ఈ రెండు సినిమాలు అందించిన లాభాలు నిర్మాతలకు సైతం ఎంతో ఆనందాన్ని కలిగించాయని కచ్చితంగా చెప్పవచ్చు.

సంక్రాంతికి వస్తున్నాం, తండేల్ సినిమాలు పరిమిత బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలే అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి.రాబోయే రోజుల్లో సైతం వెంకటేశ్, నాగచైతన్య ( Venkatesh, Naga Chaitanya )విజయవంతంగా కెరీర్ ను కొనసాగించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.డబ్బింగ్ సినిమాలలో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా మంచి లాభాలను అందించిందని చెప్పవచ్చు.
ఈ సినిమా ఇప్పటికే లాభాల బాట పట్టిందని చెప్పిందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.

మామా అల్లుళ్లు బాక్సాఫీస్ వద్ద రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలు సృష్టించాలని అక్కినేని, దగ్గుబాటి అభిమానులు కోరుకుంటున్నారు.వెంకటేశ్, నాగచైతన్య పారితోషికాలు ఒకింత పరిమితంగానే ఉన్నాయనే సంగతి తెలిసిందే.ఈ హీరోలు ఇండస్ట్రీని షేక్ చేస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు.
వెంకటేశ్, నాగచైతన్య ఇప్పటికే వెంకీమామ సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే.బాబీ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేదు.
వెంకటేశ్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి త్వరలో స్పష్టత వచ్చే ఛాన్స్ అయితే ఉంది.