తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు రాజేంద్ర ప్రసాద్( Actor Rajendra Prasad ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో ఎన్నో సినిమాలలో హీరోగా నటుడిగా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకోవడంతో పాటు నట కిరీటి అనే పేరును కూడా సంపాదించుకున్నారు.
ఇప్పటికీ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నారు.ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను తన నటనతో విపరీతంగా ఆకట్టుకున్నారు ఈ సీనియర్ నటుడు.
డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత సహ నటుడిగా, హీరోగా అద్భుతంగా నటించి మెప్పించారు.
ముఖ్యంగా కామెడీ పాత్రల్లో( Comedy Roles ) నటించి నవ్వుల పువ్వులు పూయించారు రాజేంద్రప్రసాద్.కేవలం కామెడీ తరహా పాత్రలోనే కాకుండా సీరియస్ పాత్రల్లో ఎమోషన్స్ పాత్రలో కూడా బాగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఇది ఇలా ఉండే ఈ మధ్యకాలంలో రాజేంద్రప్రసాద్ ఫుల్ బిజీబిజీగా మారిపోయారు.
ఇటీవల కాలంలో ఆయన వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీబిజీగా ఉన్నారు.ఇటీవల విడుదలైన కల్కి సినిమాలో( Kalki Movie ) కూడా కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.
అలాగే ఇప్పుడు చిన్న, పెద్ద హీరోల సినిమాల్లో నటిస్తున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.రామారావు గారి స్పూర్తితో ఇండస్ట్రీలోకి వచ్చాను.అలాగే సినిమాల్లోకి రావడం నా తండ్రికి ఇష్టం లేదు.సినిమాల్లో ఫెయిల్ అయితే తిరిగి ఇంటికి రావొద్దు అన్నారు.ఎలాగైనా సినిమాల్లో సక్సెస్ అవ్వాలని అనుకున్నాను.కానీ నాకు అవకాశాలు రాలేదు.
అప్పటికే స్నేహం అనే సినిమాలో చిన్న పాత్ర చేశాను.ఆ తర్వాత అవకాశాలు రాలేదు.
తినడానికి తిండి లేదు.ఇంటికి నాన్న రానివ్వరు.
చేతిలో డబ్బులు లేవు.అవకాశాలు రావడం లేదు.
అప్పటికే భోజనం చేసి మూడు నెలలు అవుతుంది.చేతిలో ఉన్న చిల్లరతో రోజుకు ఒక్క అరటిపండు, ఒక గ్లాస్ మజ్జిగ మాత్రమే తాగుతూ జీవించాను.
చివరకు అవి కూడా అయిపోయాయి.ఇక మరణమే శరణం అనుకున్నా ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నా చివరిగా నా గురు సమానులు అయిన అందరిని ఒక్కసారి కలుద్దాం అని వెళ్ళాను.
ముందుగా రామారావుగారి ఇంటికి వెళ్ళాను.ఆయన ఎదో బిజీలో ఉన్నారు.
అలా తిరిగి తిరిగి చివరకు పుండరీకాక్ష్యయ్య గారి( Pundarikakshaiah ) దగ్గరకు వెళ్ళాను.అప్పటికే అక్కడ ఎదో పెద్ద గొడవ అవుతుంది.నన్ను చూసిన ఆయన ఎప్పుడు వచ్చావ్ అంటూ నన్ను పలకరించారు.ఆ తర్వాత నన్ను తీసుకొని వెళ్లి మేలుకొలుపు అనే సినిమాకు డబ్బింగ్ చెప్పించారు.ఆ సినిమాలో నటించిన వ్యక్తి తమిళనాడుకు చెందిన వాడు కావడంతో నాతో డబ్బింగ్ చెప్పించారు.నేను నాలుగు డైలాగ్స్ చెప్పాను.
ఆ తర్వాత నేను భోజనం చేసి మూడు నెలలు అయ్యింది.ఆకలి వేస్తుంది.
ఏదైనా తిని చెప్పాను అన్నాను అంటూ ఎమోషనల్ అయ్యారు రాజేంద్ర ప్రసాద్.