నల్లటి వలయాలతో వర్రీ వద్దు.. ఇలా చేస్తే వారం రోజుల్లో మాయం అవుతాయి!

ముఖాన్ని మరింత అందంగా ఆకర్షణీయంగా చూపించే వాటిలో కళ్ళు ఒకటి.అయితే నిద్రలేమి( Insomnia ), ఒత్తిడి, ఎక్కువ సేపు స్క్రీన్ దగ్గర ఉండటం, హార్మోన్లలో మార్పులు, ధూమపానం, పలు రకాల మందుల వాడకం తదితర కారణాల వల్ల కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి.

 Homemade Gel To Prevent Dark Circles Is For You! Homemade Gel, Dark Circles, Dar-TeluguStop.com

ఇవి కళ్ళ అందాన్ని తగ్గిస్తాయి.ముఖాన్ని కాంతిహీనంగా చేస్తాయి.

ఈ క్రమంలోనే నల్లటి వలయాలను వదిలించుకునేందుకు మార్కెట్లో లభ్యమయ్యే ఉత్పత్తులపై ఆధారపడుతుంటారు.అయితే వాటి వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో పక్కన పెడితే.

ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ హోమ్ రెమెడీతో చాలా సులభంగా వేగంగా నల్లటి వలయాలను వదిలించుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హోమ్ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.

Telugu Tips, Dark Circles, Darkcircles, Homemade Gel, Latest, Skin Care, Skin Ca

ముందుగా ఒక నిమ్మ పండు తీసుకుని ఉప్పు నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు( Flax seeds ) మరియు కట్ చేసి పెట్టుకున్న నిమ్మ పండు ముక్కలు వేసి పది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించాలి.

Telugu Tips, Dark Circles, Darkcircles, Homemade Gel, Latest, Skin Care, Skin Ca

జెల్లీ స్ట్రక్చర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసి స్టైనర్ సహాయంతో జెల్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ జెల్ ను చల్లారబెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయిన అనంతరం ఈ జెల్ లో చిటికెడు కుంకుమ పువ్వు, రెండు చుక్కలు లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ జెల్ ను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.నల్లటి వలయాలతో( Dark circles ) వర్రీ అవుతున్న వారు.

నైట్ నిద్రించే ముందు తయారు చేసుకున్న జెల్ ను కళ్ళ చుట్టూ అప్లై చేసుకుని స్మూత్ గా రెండు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.

Telugu Tips, Dark Circles, Darkcircles, Homemade Gel, Latest, Skin Care, Skin Ca

ఈ హోమ్ మేడ్ జెల్ ను రెగ్యులర్ గా వాడితే వారం రోజుల్లోనే కళ్ళ చుట్టూ ఏర్పడిన నల్లటి వలయాలు మాయం అవుతాయి.అలాగే కళ్ళ వద్ద ఏమైనా ముడతలు ఉన్నా సరే త‌గ్గుముఖం ప‌డ‌తాయి.నల్లటి వలయాలను సహజంగానే నివారించడానికి ఈ హోమ్ మేడ్ జెల్ చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.

కాబట్టి ఎవరైతే నల్లటి వలయాలతో బాధపడుతున్నారో తప్పకుండా వారు ఇంట్లోనే ఈ జెల్ ను ప్రిపేర్ చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube